
Keshaboina Sridhar BJP
June 20, 2025 at 06:24 AM
“తెలంగాణ ప్రభుత్వం కొత్త గోశాలలు నిర్మించాలనే నిర్ణయాన్ని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు, దీన్ని మంచి పరిణామంగా అభివర్ణించారు. అయితే, వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను అక్రమంగా చంపుతున్నారని ఆరోపిస్తూ, దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు.
‘గో రక్షణ కోసం ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి, అందులో నన్ను సభ్యుడిగా నియమించాలి, తెలంగాణలో గోవధను పూర్తిగా నిషేధించాలి’ అని రాజా సింగ్ డిమాండ్ చేశారు.
మీ అభిప్రాయం ఏమిటి? గో రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలా? కామెంట్స్‌లో తెలపండి.
#cowprotection #telangana #bjp #rajasingh #animalwelfare”

👍
3