Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
May 27, 2025 at 03:08 PM
జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 27.05.2025, *• పశువుల అక్రమ రవాణాను నియంత్రిస్తూ.., జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.* బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల /పశువుల అక్రమ రవాణ జరగకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాలైన కంది, ముత్తంగి చెక్ పోస్ట్ లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, పశువుల అక్రమ రవాణ జరగకుండా చూడాలని అన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, నైట్ టైమ్ చెక్ పోస్ట్ నందు విధులు నిర్వహించే సిబ్బంది, లైట్ బాటన్, రెఫ్లెక్షన్ జాకెట్ ధరించాలని సూచించారు.

Comments