Sangareddy District Police Updates
June 7, 2025 at 05:45 AM
జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన -తేది: 06.06.2025.
*• ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు..*
*• పండుగలను సుఖ:సంతోషాల నడుమ, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి..*
*• బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.*
ఈ రోజు తేది: 07.06.2025 నాడు బక్రీద్ పండుగను పురస్కరించుకొని, సంగారెడ్డి హాస్టల్ గడ్డ, సదాశివపేట పట్టణాలలో ఈద్గా లను జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ప్రత్యేకంగా సందర్శించి, అక్కడి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగా శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలను సుఖ:సంతోషాల నడుమ, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించాలని ఎస్పీ గారు సూచించారు. అత్యవసర సమయంలో డైల్ 100 చేయాలని అన్నారు.
ఈ విజిటింగ్ నందు ఎస్పీ గారి వెంబడి సంగారెడ్డి డియస్పీ సత్యయ్య గౌడ్, సదాశివపేట ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, తదితరులు ఉన్నారు.