Sangareddy District Police Updates
June 9, 2025 at 06:50 AM
జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 09.06.2025,
*• సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్ఐ లకు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి కల్పించిన మల్టీ జోన్- II ఐజి, శ్రీ వి.సత్యనారాయణ ఐపియస్ గారు.*
*• పదోన్నతి పొందిన ఇన్స్పెక్టర్స్ వెంకట్ రెడ్డి, ప్రసాద్ రావ్ లను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపియస్ గారు.*
2012లో పోలీసు శాఖలో సబ్-ఇన్స్పెక్టర్స్ గా నియామకమైన వెంకట్ రెడ్డి ఎస్ఐ, ప్రసాద్ రావ్ ఎస్ఐ లు గడిచిన 13 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లలో యస్.హెచ్.ఓ. లుగా విధులు నిర్వహించి, విశిష్ట సేవలందించచారు. సర్వీసులో ఎలాంటి రిమార్క్ లేకుండా అధికారుల మన్ననలు పొందారని, వీరు అందించిన ఉత్తమ సేవలకు గాను ఇన్స్పెక్టర్స్ గా పదోన్నతి కలిస్తూ గౌరవ మల్టీ జోన్- II ఐజి శ్రీ వి.సత్యనారాయణ ఐపియస్ గారు ఉత్తర్వులు వెలువరిచారని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపియస్ గారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. సుధీర్గ సర్వీస్ లో ఎలాంటి రిమార్క్ లేకుండా ఇన్స్పెక్టర్స్ గా పదోన్నతి పొందడం అభినందనీయమని, పదోన్నతి పొందిన వెంకట్ రెడ్డి, ప్రసాద్ రావ్ లను ఎస్పీ గారు అభినందించి, ఇన్స్పెక్టర్ ర్యాంక్ చిహ్నంను ధరింపజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వర్తిస్తూ.. ప్రజలలో పోలీస్ శాఖ పట్ల ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని మరింతగా పెంచే విధంగా కృషి చేస్తూ.., సర్వీసులో మరిన్ని ఉత్తమ సేవలను అందించి రాష్ట్ర పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.