Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
June 9, 2025 at 08:58 AM
జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన -తేది: 09.06.2025 • మానవత్వం చాటుకున్న ఆటోడ్రైవర్ షైక్ ఖదీర్.. • ఆటో లో మరిచిపోయిన 12.5 తులాల బంగారం, నగదు తిరిగి ప్రయాణికునికి అందజేత.. • ఆటోడ్రైవర్ షైక్ ఖదీర్ ను అభినందించి, రివార్డ్ అందజేసిన.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.. వివరాలలోని వెళ్లితే.. సంఘగోని శ్రీనివాస్ గౌడ్ తండ్రి సత్యగౌడ్, నివాసం కల్హేర్ గ్రామం, మండలం. శుభకార్యానికై సంగారెడ్డి మల్కాపూర్ చౌరస్తాలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చి తిరిగి కుటుంబ సభ్యులతో కలిసి కల్హేర్ వెళ్ళుటకు గాను ఈ రోజు తేది: 09.06.2025 నాడు ఉదయం అందాజ 8:00 గంటల సమయంలో మల్కాపూర్ చౌరస్తాలో ఆటో ఎక్కి సంగారెడ్డి కొత్తబస్ స్టాండ్ కు వచ్చి, బంగారు ఆభరణాలు, నగదు కలిగిన బ్యాగ్ ను ఆటో లో మరిచి వెళ్లిపోగా, కొంత సమయం తరువాత అదిగమనించిన ఆటో డ్రైవర్ షైక్ ఖదీర్ అట్టి బ్యాగ్ ను సంగారెడ్డి టౌన్ పోలీసు స్టేషన్ లో అందించడం జరిగింది. తమ బ్యాగ్ మిస్ అయిందని గుర్తించిన సంఘగోని శ్రీనివాస్ గౌడ్ నేరుగా పోలీసు స్టేషన్ కు రాగా.., మిస్ అయిందనుకున్న బ్యాగ్ ను చూసి సంతోషించారు. ఆటో డ్రైవర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రయాణికులు మరిచిపోయిన/ పోగొట్టుకున్న తమ విలువైన బంగారం, నగదు కలిగిన బ్యాగ్ ను తిరిగి ప్రయాణికులకు అందించడంలో ఆటో డ్రైవర్ షైక్ ఖదీర్ తండ్రి లతీఫ్, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం నాలసాబ్ గడ్డ, సంగారెడ్డి టౌన్. మానవత్వాన్ని చాటుకున్నాడాని. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు షైక్ ఖదీర్ ను అభినందించి, నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ ప్రయాణిడు సంఘగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.
👍 🙏 8

Comments