Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
June 14, 2025 at 08:19 AM
జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 14.06.2025 *• ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.., పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం.* *• క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలి..:* *జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.* జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారి ఆదేశానుసారం ఈ రోజు తేది: 14.06.2025 నాడు పోలీసు పరేడ్ గ్రౌండ్స్ నందు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీసు సిబ్బందికి డియస్పీ నరేందర్ గారి ఆద్వర్యంలో వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం అని, శారీరకంగా, మానసికంగా ఫిట్నెస్ తో ఉన్నప్పుడే ఎలాంటి పరిస్థితులలోనైనా విధులను సమర్ధవంతంగా నిర్వర్తించగలమని, ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి ప్రతి రోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది వీధి నిర్వహణలో అంకిత భావంతో పని చేయాలని, తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. విఐపి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహించే అధికారులు విఐపి భద్రత విషయమై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో గల సస్పెక్ట్స్, హిస్టరీ షీటర్ల గురించి పూర్తి అవగాహన కలిగి, నిఘా ఉంచాలని అన్నారు. మన చుట్టూ జరుగుతున్న ఆస్థి సంబంధిత నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ గురించి ప్రజలలో కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ వీక్లీ పెరేడ్ నందు ఎఆర్ డియస్పీ నరేందర్, ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, ప్లటూన్ ఇంచార్జ్ లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Comments