
Sangareddy District Police Updates
June 16, 2025 at 01:23 PM
జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన తేది: 16.06.2025,
• ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదుల స్వీకరించిన..
• ఫిర్యాది సమస్య తక్షణ పరిష్కారానికి యస్.హెచ్.ఓ లకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.
ఈ రోజు తేది: 16.06.2025 సోమవారం నాడు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఓపిగకగా విని, వారి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాది సమస్య తక్షణ పరిష్కారం కోసం సంబంధిత యస్.హెచ్.ఓ. లకు ఫోన్ ద్వారా మాట్లాడి, వారి సమస్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. చట్టప్రకారం కేసులను పరిష్కరించాల్సిందిగా యస్.హెచ్.ఓ. లకు సూచనలు చేయడం జరిగింది.
జిల్లా ప్రజలు తమ సమస్యకు పరిష్కారం దొరకని సందర్భంలో నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా స్వచ్చంధంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని, సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు, పోలీసు శాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలసిందిగా ఎస్పీ గారు సూచించారు.