Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
June 16, 2025 at 03:13 PM
జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 16.06.2025 *• నారాయణఖేడ్, సిర్గాపూర్, కంగ్టీ, కల్హేర్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..* *• రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి ఎలాంటివి అక్రమ రవాణా జరగడానికి వీలులేదు..* *• విల్లేజ్ విసిటింగ్స్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి..* *• ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ ఆప్స్ మరియు సైబర్ క్రైమ్స్ గురించి, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. : జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు.* ఈ రోజు తేది: 16.06.2025 నాడు నారాయణఖేడ్, సిర్గాపూర్, కంగ్టీ, కల్హేర్ పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ ఆవరణ, బ్యారెక్ పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం స్టేషన్ రికార్డ్ లను తనిఖీ చేస్తూ.. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలని, లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని అన్నారు. ముఖ్యంగా మిస్సింగ్/ కిడ్నాప్ కేసుల ఛేదనకు సబ్-డివిజన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డియస్పీ కి సూచించారు. ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేస్తూ బాధితులకు అండగా నిలవాలని యస్.హెచ్.ఓ లకు సూచనలు చేశారు. తమ పోలీసు స్టేషన్ పరిధిలో గల సస్పెక్ట్, కేడి, రౌడీ షీటర్లను రెగ్యులర్ గా తనిఖీ చేస్తూ.. ఆన్లైన్ లో అప్ డేట్ చేయాలన్నారు. సిబ్బంది ఆయా వర్టికల్ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, జిల్లాను ముందు వరుసలలో ఉంచడానికి కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కంగ్టీ, నాగల్ గిద్ద, సిర్గాపూర్ పోలీసు స్టేషన్ ప్రాంతాల నుండి ఎలాంటివి అక్రమ రవాణా జరగకుండా బార్డర్ చెక్ పోస్ట్ లలో నిఘా కట్టుదిట్టం చేయాలని డియస్పీ కి సూచించారు. సరిహద్దు ప్రాంతాలలో మరియు ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నారాయఖేడ్ వంటి రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ప్రతి రోజు వాహనాల తనిఖీ నిర్వహించాలని, అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి, సైన్ బోర్డులను ఏర్పాటు చేసే విధంగా చూడాలని అన్నారు. ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్స్ మరియు రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యస్.హెచ్.ఒ కు సూచనలు చేశారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. సిబ్బంది, అధికారులు 24*7 పోస్టింగ్ హెడ్ క్వార్టర్ నందు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సుదూర ప్రాంతాల నుండి ప్రయాణాలు ప్రమాదానికి దారి తీయవచ్చని అన్నారు. సిబ్బంది వాహనాలు నడిపేటప్పుడు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. విధి నిర్వహణలో పూర్తి నిబద్దతతో ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ తనిఖీలలో ఎస్పీ గారి వెంబడి నారాయణఖేడ్ డియస్పీ వెంకట్ రెడ్డి, నారాయణఖేడ్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, కంగ్టీ, సిఐ చంద్రశేఖర్, నారాయణఖేడ్ ఎస్ఐ విధ్యాచరణ్ రెడ్డి, కంగ్టీ ఎస్ఐ దుర్గా రెడ్డి, సిర్గాపూర్ ఎస్.హెచ్. ఓ వెంకట్ రెడ్డి, కల్హేర్ ఎస్ఐ వెంకటేశం తదితరులు ఉన్నారు.
❤️ 2

Comments