Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
June 17, 2025 at 08:53 AM
జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 17.06.2025. *• స్కూల్, కళాశాల బస్ డ్రైవర్లకు డ్రంక్ అండ్ టెస్ట్ లు.. మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్ల పై చట్ట రిత్య కఠిన చర్యలు..* *9• విధ్యాసంస్థల యాజమాన్యాలు డ్రైవర్లకు డ్రంక్ అండ్ టెస్ట్ చేసిన తరువాతనే విధులలోనికి అనుమతించాలి..* *: జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు..* ఈ రోజు తేదీ; 17.06.2025, మంగళవారం నాడు ఉదయం పటాన్ చెర్వు పరిధిలో స్కూల్స్, కళాశాలలకు వెల్లుతున్న బస్ డ్రైవర్లకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ప్రతి స్కూల్, కళాశాల యాజమాన్యాలు తమ బస్సు డ్రైవర్లను విధులలోనికి అనుమతించే ముందు తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసిన తరువాతనే విధులలోనికి అనుమతించాలని అన్నారు. ఎవరైనా పోలీసుల చెక్కింగ్ లో పట్టుబడినట్లైతే డ్రైవర్ తో పాటు విధ్యాసంస్థల యాజమాన్యాలపై చట్ట రిత్య కఠిన చర్యలు తప్పవు అన్నారు.

Comments