
Sangareddy District Police Updates
June 17, 2025 at 01:11 PM
జిల్లా పోలీసు కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 17.06.2025.
*• బదిలీ పై వెళుతున్న చైతన్య సీనియర్ సిస్టంట్ ను సన్మానించి, ఘనంగా వీడ్కోలు పలికిన, అదనపు ఎస్పీ ఎ. సంజీవ రావ్ గారు.*
ఈ రోజు తేది: 17.06.2025 నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశనికి హాజరైన అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్ గారు బదిలీ పై వెళుతున్న చైతన్య సీనియర్ సిస్టంట్ ను సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టంట్ గా విధులు నిర్వహించి, సుదీర్ఘ సర్వీస్ లో ఎలాంటి రిమార్క్ లేకుండా అంచలంచలుగా ఎదుగుతూ.. సీనియర్ సిస్టంట్ గా పదోన్నతి పొందడం అభినందననీయమని, పదోన్నతితో భాద్యత మరింత పెరుగుతుందని గుర్తు చేస్తూ.. బదిలీ పై వెళుతున్న సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో కూడా ఇదే విధంగా ఉత్తమ సేవలను అందించాలని కొరకుంటున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, ఆఫీసు సూపరిటెండెంట్స్ అశోక్, వెంకటేశం, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.