Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
June 18, 2025 at 01:54 PM
జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా, పత్రిక ప్రకటన, తేది: 18.06.2025 *• రెండు వేరువేరు కేసులలో నలుగురికి జీవిత ఖైదు..* *• హత్య కేసులో నిందితుడు పట్లోళ్ల రమణ @ రమేష్ కు జీవిత ఖైదు..* *• వరకట్నం వేదింపుల కేసులో బుక్కా జాఫర్, సయ్యద్ మొయినుద్దీన్, జహీరా బీ లకు జీవిత ఖైదు..* *: వివరాలు వెళ్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు.* *(1) నేరం సంఖ్య:* కేసు నెం.116/2018 - సెక్షన్ 302 IPC ప్రకారం, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న హత్య కేసులో నిందితుడైన పట్లోళ్ల రమణ @ రమేష్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ, గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీమతి జి.భవానీచంద్ర గారు తీర్పు ఇచ్చారు. శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. *కేసు వివరాలలోనికి వెళ్లితే:* మృతురాలు భాగ్యలక్ష్మీ భర్త నర్సింలు, వయస్సు: 38 సంవత్సరాలు, వృత్తి టైలరింగ్ పని చేసుకుంటూ తన తల్లిగారి గ్రామం మక్తలూరులో నివాసం ఉంటున్నది. అదే గ్రామానికి చెందిన పట్లోళ్ల రమణ @ రమేష్ కు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, అందరి ముందు ఆడగగా, నిందితుడు పట్లోళ్ల రమణ @ రమేష్, ఎలాగైనా భాగ్యలక్ష్మిని చంపి, అప్పు గొడవ లేకుండా చేయాలని నిర్ణహించుకొని తేది: 20.07.2018 నాడు ఫోన్ ద్వారా పలిచి వారి పశువుల కొట్టంలో భాగ్యలక్ష్మీ గొంతు నులిమి చంపి, ఉరివేసుకొని చనిపోయినట్లుగా చిత్రీకరించాడు. ఇట్టి విషయమై ఫిర్యాది తలారి లక్ష్మీ చట్టరిత్యా తగు చర్య తీసుకోవలసిందిగా సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు చేయగా అప్పటి యస్.హెచ్.ఒ జి.యాదవరెడ్డి ఎస్ఐ కేసు నమోదు చేయగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన శివకుమార్ ఇన్స్పెక్టర్ న్యాయ స్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేయగా, కేసు పూర్వపరాలను విన్న గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీమతి జి.భవానీచంద్ర గారు నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. *నిందితుని వివరాలు:* పట్లోళ్ల రమణ @ రమేష్, తండ్రి సిద్దిరామప్ప, వయస్సు: 55 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, నివాసం: మక్తలూరు గ్రామం, కంది మండలం, సంగారెడ్డి జిల్లా. *(2) నేరం సంఖ్య:* కేసు నెం. 55/2018 - సెక్షన్ 304(B) IPC ప్రకారం, రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న వరకట్న వేధింపుల మరణం కేసులో నిందితులు (1) బుక్కా జాఫర్, (2) సయ్యద్ మొయినుద్దీన్, (3) జహీరా బీ లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ, గౌరవ 2వ అదనపు డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి డా.. పి. కృష్ణఅర్జున్ గారు తీర్పు ఇచ్చారు. శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. *కేసు వివరాలలోనికి వెళ్లితే:* పిర్యాది మహ్మద్ జిలానీ తండ్రి ఉస్మాన్, వయస్సు: 51 సంవత్సరాలు, నివాసం సింగీతం గ్రామం, రాయికోడ్ మండలం,తన కూతురు సమీన బేగం ను అదే గ్రామానికి చెందిన నిందితుడైన బుక్కా జాఫర్ కు ఇచ్చి పెద్దల సమమక్షంలో వివాహం జరిపించగా 2 సంవత్సరాలు తరువాత అదనపు కట్నం తీసుకురావాలని సమీన బేగం భర్త బుక్కా జాఫర్, మామ సయ్యద్ మొయినుద్దీన్, అత్త బుక్కా జహీరా బీ లు మానసికంగా, శారీరకంగా వేదించారని, మనస్తాపానికి గురైన సమీన బేగం తేది: 23.10.2018 నాడు విషం తాగి చనిపోయిందని, తన కూతురు మరణానికి కారణమైన భర్త బుక్కా జాఫర్, మామ సయ్యద్ మొయినుద్దీన్, అత్త బుక్కా జహీరా బీ లపై చట్టరిత్యా తగు చర్య తీసుకోవలసిందిగా రాయికోడ్ పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు చేయగా అప్పటి యస్.హెచ్.ఒ చంద్రయ్య ఎస్ఐ కేసు నమోదు చేయగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన డియస్పీ గణపతిదేవ్ న్యాయ స్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేయగా, కేసు పూర్వపరాలను విన్న గౌరవ 2వ అదనపు డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి డా.. పి. కృష్ణఅర్జున్ గారు నిందితులు ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. *నిందితుల వివరాలు:* 1 బుక్కా జాఫర్ తండ్రి సయ్యద్ మొయినుద్దీన్, వయస్సు: 24 సంవత్సరాలు, వృత్తి: పంక్చర్ షాప్. 2 బుక్కా మొయిన్ @ మొయినుద్దీన్ తండ్రి లేట్ సాదత్ అలీ, వయస్సు:68 సంవత్సరాలు వృత్తి: వ్యవసాయం. 3 బుక్కా జహీరా బీ భర్త మొయిన్ @ మొయినుద్దీన్ వయస్సు: 60 సంవత్సరాలు వృత్తి: వ్యవసాయం అందరి గ్రామం సింగీతం, రాయికోడ్ మండలం సంగారెడ్డి జిల్లా. నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ, విజయ్ శంకర్ రెడ్డి, కోర్ట్ డ్యూటీ కానిస్టేబుల్స్ శివరాములు, అశోక్, కోర్ట్ లైజనింగ్ అధికారి హెడ్.కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుల్ రాగవేంద్ర, కె. సత్యనారాయణ ఎస్ఐ. గార్లను ఎస్పీ గారు అభినందించారు.

Comments