Sangareddy District Police Updates
June 19, 2025 at 04:06 PM
జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన - తేది: 19.06.2025,
*• అత్యవసర సమయంలో ఏవిధంగా స్పందించాలని సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ సంయుక్త ఆపరేషన్ లో ది గాడియం స్కూల్ లో నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతం..*
*• సహకరించిన ది గాడియం స్కూల్ యాజమాన్యానికి వారి సహకారానికి గాను అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.*
ఈ రోజు తేది: 19.06.2025 నాడు సంగారెడ్డి జిల్లా, బిడియల్ భానూర్ పోలీసు స్టేషన్ పరిదిలో గల ది గాడియం స్కూల్ ప్రాంగణంలో సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతమైదని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ఇటీవల మన దేశంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో, అత్యవసర పరిస్థితులలో ఏవిధంగా స్పందించాలని స్కూల్ విధ్యార్థిని, విధ్యార్థులకు, భోదన సిబ్బందికి అవగాహన కలిపించాలనే ఉద్ధేశ్యంతో ఈ డ్రిల్ చేపట్టడం జరిగిందని, ఈ డ్రిల్ జిల్లా పోలీసు, డాగ్ స్క్వాడ్, ఫైర్ డిపార్ట్‌మెంట్ తదితర అత్యవసర విభాగాల సహకారంతో, సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ డ్రిల్ లో విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ది గాడియం స్కూల్ యాజమాన్యానికి, అన్ని అధికారులకు ఎస్పీ గారు అభినందనలు తెలియజేస్తున్నాము.