GSWS Helper ✅
June 16, 2025 at 12:42 PM
💬 *శ్రీయుత రాష్ట్ర GSWS డైరెక్టర్ గారి ది.16-6-2025 న VC (వీడియో కాన్ఫరెన్స్) లోని ముఖ్యమైన అంశాలు*
🟡 *అందరు MPDO/MC లకు GSWS సిబ్బంది ట్రాన్స్ఫర్ విధివిధానాలు – Rationalization ప్రకారం*
✓ HRMS పోర్టల్ లో
ప్రతి MPDO/MC తమ పరిధిలోని సచివాలయాలు మరియు అందులో ఉన్న సిబ్బంది వివరాలు రేషనలైజేషన్ కేటగిరీలు A, B, C ప్రకారంగా చూపబడతాయి
✓ *సిబ్బంది వివరాలపై తీసుకోవాల్సిన విధివిధానాలు:*
1. వాస్తవికంగా సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారో అందుకు అనుగుణంగా ప్రతి సచివాలయం వారీగా Submit చేయాలి,అందులో వారు పని చేస్తున్నారా లేక పోస్ట్ Vacant గా ఉన్నదా అనేది ఖచ్చితంగా పేర్కొనాలి.
2. డిప్యూటేషన్ లో ఉన్న సిబ్బంది విషయంలో వారు ఎక్కడి నుండి జీతం తీసుకుంటున్నారో, అదే సచివాలయంలో వారిని వర్కింగ్ గా చూపించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ Vacant గా చూపించకూడదు.
https://t.me/GSWShelper
3. ట్రాన్స్ఫర్ చేయదలచినప్పుడు "Yes" Position నుంచి "Yes" Positionకి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయవలెను. అంటే ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టు కూడా Yes గా ఉండాలి, టార్గెట్ పోస్టు కూడా Yes మాత్రమే అయ్యి ఉండాలి.
✓ *Urban to Rural ట్రాన్స్ఫర్ విషయంలో ప్రత్యేక నిబంధన:*
1. సిబ్బంది Native Mandal మున్సిపాలిటీ పరిధిలో ఉంటే, వారు పక్కనున్న Rural ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కావాలంటే, ఆ Urban మరియు Rural ఏరియాలు వేర్వేరు Revenue Mandalలకు చెందినవి కావాలి.
2. ఒకే Revenue Mandal కి చెందిన Rural-Urban కి ట్రాన్స్ఫర్ అనుమతించబడదు