Philadelphia AG Church Vijayawada
June 13, 2025 at 09:14 AM
🇹🇴🇩🇦🇾'🇸 🇲🇪🇸🇸🇦🇬🇪
(13th -June-2025) Friday
𝓑𝔂 *𝑹𝒆𝒗. 𝑪𝒉𝒂𝒓𝒍𝒆𝒔 𝒑 𝑱𝒂𝒄𝒐𝒃*
#friday fasting ͎S͎e͎r͎v͎i͎c͎e͎
@𝑷𝒉𝒊𝒍𝒂𝒅𝒆𝒍𝒑𝒉𝒊𝒂 𝑨𝒈 𝒄𝒉𝒖𝒓𝒄𝒉 ⛪
మన ప్రసంగం🔰 :
కీర్తనలు 37:7
యెహోవా యెదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము. తన మార్గమున వర్థిల్లు వాని చూచి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్చు కొను వాని చూచి వ్యసన పడకుము.
*ప్రసంగ అంశం🛡️: యేసయ్యా జోక్యం చేసుకొని పరిస్థితిని పరిష్కరిస్తారు...*
కీర్తనలు 37:7
యెహోవా యెదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము. తన మార్గమున వర్థిల్లు వాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చు కొను వాని చూచి వ్యసన పడకుము.
Psalm 37:7(NIV)
Be still before the Lord and wait patiently for him; do not fret when people succeed in their ways, when they carry out their wicked schemes.
*.ఆర్థికంగా 💰 💰 ఇబ్బంది పడుతున్నావు.. కొంతమంది నీకు తెలిసిన వాళ్ళు నీకు సహాయం చేస్తారు ఎందుకంటే నిన్ను lift 🛗 చెయ్యడానికి
*.అయిన నువ్వు పైకి రావట్లేదు ... అలాంటప్పుడు వాళ్ళు వదిలేస్తారు ... అప్పుడు నీకు నిరాశ కలుగుతుంది
*.అలాంటప్పుడు నీవు చావడానికి ప్రయత్నించకూడదు ..
*.అది ఏ సమస్య అయిన సరే నువ్వు మరణించ కూడదు...
*.దేవుడు జోక్యం చేసుకొని సహాయం చేస్తారు
*.దావీదు గారు కూడా అలాగే వెళ్తున్నారు ..నిరాశ కలిగింది ..కానీ మరణించే నిరాశ వరకు వెళ్ళలేదు
*.ఆయన ఇలా అంటున్నారు యెహోవా యెదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము.
*✳️కీర్తనలు:37:1-13*
*.ఈరోజు నిరాశలో వున్న నిన్ను చూసి నవ్వుతున్నారా 😂 ..అయితే విను 👂 వారిని చూసి యేసయ్యా నవ్వుతున్నారు
*.ఎందుకంటే ఆయనే జోక్యం చేసుకొని నీ పరిస్థితిని పరిష్కరిస్తారు
❇️మనం ఏమి అనుకుంటాం అంటే ప్రజలు పట్టించుకోలేదు గనుక యేసయ్యా కూడా పట్టించుకోరు అని..
❇️మనం ఏమి అనుకుంటాం అంటే ప్రజలు చూసి చూడనట్టు వెళ్ళిపోయారు గనుక యేసయ్యా కూడా అలాగే చేస్తారు అని..
*.దేవుడు జోక్యం చేసుకుంటారు
*. ఎప్తా గారు వేశ్య కుమారుడు ....ఈ బాబు👶 ను కన్నా తర్వాత ఆమె చనిపోయారు ...
*.ఇతన్ని వేరే తల్లి పెంచారు ...కానీ ఒక వయస్సు రాగానే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు
*.అప్పుడు ఆయన విశ్వాసం తో వుండి ఆయన కొరకు కనిపెట్టారు ...నా దేవుడు న్యాయాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలకు మార్చారు
*.యెబ్బేజు గారు పుట్టినప్పుడు ఆయన్ని వారి తల్లి వేదనలో కన్నారు కాబట్టి వేదన పుత్రుడు అని పేరు పెట్టారు
*.అయితే ఆయన దేవునితో మొఱ్ఱ పెట్టగా దేవుడు జోక్యం చేసుకొని ఆశీర్వదించారు
*.ఈరోజు యేసయ్యా తర్వాత మనల్ని పైకి తీసుకురావడానికి ఒక్కరూ 🤵♂కావాలి ...
*.అయితే దేవుడు చెప్పేది అలాంటి మనుష్యులు లేనంత మాత్రాన నువ్వు నిరాశ పడకు ..చావద్ధు ..
*.నా దేవుడు జోక్యం చేసుకుని నిన్ను lift 🛗 చేస్తారు..
*.ఆ సమయంలో ఎవ్వరూ నిలబడలెనప్పుడు వారికి దైవికమైన సహాయం అందింది
*.ఈరోజు నువ్వు మునిగిపోయాక పిలవద్దు యేసయ్యా ను మునిగిపోతున్నప్పుడు దేవున్ని పిలువు ....*
*.ex: పేతురు గారు మునీగిపోతునప్పుడు కేకలు పెట్టారు
*. యోన గారు...పౌలు గారు మునిగిపోయినప్పుడు కేకలు పెట్టారు
*.అయినప్పటికీ దేవుడు సహాయం అందించారు ..
*.ఏ కనులైతే 👀 మన ఉన్నత స్థితిని చూసాయో అదే కన్నులు నువ్వు దిన స్థితిలో వుండటం చూస్తున్నారా ...
*.అయితే కేకలు పెట్టు నా దేవుడు మన జీవితాన్ని నిలబెడతారు
*.ఈరోజు నువ్వు
✅ప్రార్థనలో 🙏
✅వాక్యంలో 📖
✅ఆత్మీయత లో
✅పరిశుద్ధతలో మునిగిపోతున్నావా
*.అయితే మరల కేకలు పెట్టు ..దేవుని సన్నిధిలో ప్రార్థించు 🙏 దేవుడు సహాయం చేస్తారు
*.ఈరోజు ఏ కన్నులైతే 👀
✅సిగరెట్టు త్రాగకపోవడం
✅మద్యం త్రాగకపోవడం
✅పాపం చెయ్యకపోవడం
✅ఆర్థిక సమస్యలు విషయంలో చూసినాయే అదే కన్నులు 👀 నువ్వు అవి చేయడం చూస్తున్నాయా
*.అయితే నువ్వు వెంటనే కేకలు పెట్టాలి ...
*.ఈరోజు దేవుడవునిన్ను పురుష🤵♂ శక్తి నుండి .. స్త్రీ👩 శక్తి నుండి విడిపించారు
*.కానీ నీకు తెలియకుండా మరల నీకు ఆకర్షణ కలుగుతుందా దానికి అర్ధం నీ జీవితం మునిగిపోతుంది ...
*.అయితే నువ్వు దేవుని దగ్గర మొర్ర పెట్టాలి ..నా దేవుడు తన హస్తాన్ని ✋ పట్టుకొని నిన్ను బయటకి లేపుతారు
*.యేసయ్యా ఎలాగైతే తన హస్తాన్ని ఇచ్చి మునిగిపోతున్నా పేతురు గారిని పైకి లేపారో అలాగే నా దేవుడు నిన్ను లేవ నెత్తుతారు ..
*.నా దేవుడు నీ పరిస్థితిని పరిష్కరిస్తారు
*.శాంసన్ గారి జీవితాన్ని దేలీలా పాడు చేసేసింది ..కానీ దేవుని వైపు చివరిలో తిరగగా దేవుడు బలం ఇచ్చి నడిపించారు
*.దావీదు గారు ఆయన అన్ని కోల్పోయారు కానీ ఆయన మరణించలేదు ...
*.దేవుని యొక్క హెచ్ఛింపు చూశారు
*.అదే దేవుడు మనకు కూడా సహాయం చేస్తారు
*1️⃣మళ్ళీ గుర్తు చేసుకో....*
*.దావీదు గారు గోల్యాతును ఎదురించడానికి ఒక రాయి 🪨 తో చంపారు
*.అలాగే దేవుని వాక్యం మన హృదయాన్ని మన జీవితాన్ని మారుస్తుంది
*.ఈరోజు నువ్వు గుర్తు చేసుకో దేవుడు ఏమి చేసారో నీ జీవితంలో ..
*.ఈరోజు నీ సమస్యలో మధ్యలో దేవున్ని విడచి పెట్టకు
*.ఈరోజు యేసయ్యా నా దేవుడు అని బైబిల్ పట్టుకోవడానికి ఎన్నడు సిగ్గు పడకూడదు ..
*.ఈరోజు నువ్వు గుర్తు చేసుకో నా దేవుడు చేసినవన్నీ
*.ఈరోజు నీ యెదుట నిలబడుతున్నా ప్రతి గోల్యాతు నుండి నా దేవుడు విడిపిస్తారు
*ఒక భక్తుడు అడిగిన 3️⃣ప్రశ్నలు*
1️⃣.మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు 🗣️ వాళ్లకు నీ ద్వారా యేసయ్యా గుర్తుకు వస్తున్నారా? ...
2️⃣.మీ ఇంటికి 🏡 ఎవరైనా వస్తే వారు యేసయ్యా ను గుర్తు చేసుకుంటున్నారా ? {లేదా} వాళ్ళకి యేసయ్యా గుర్తు వస్తున్నారా?
3️⃣.నువ్వు అలాంటివి వ్యక్తి కాదు కానీ ఎదురున్న వ్యక్తి👱♂️ అపార్థం చేసుకుంటున్నారు ..అలాంటప్పుడు నువ్వు ఏమి చేస్తావు ?
*.అయితే దానికి సమాధానం
*✳️కీర్తనలు 37:7*
యెహోవా యెదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము
*.సౌలు గారు దావీదు గారిని అపార్థం చేసుకున్నారు ...
*.అప్పుడు ఆయన ఏమి చేశారు అంటే
*✳️కీర్తనలు 37:7*
యెహోవా యెదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము...
*.నువ్వు ఎంత యదార్థంగా వున్నా నిన్ను బాధ పెడుతున్నారా ....
*.అయితే బాధ పడకు..నీ యధార్థతను విడచి పెట్టకు. ...
*.ఒకరోజు నీ యధార్థతను అందరూ చూస్తారు..
*.ఒకరోజున నీ యదర్ధతను బయటకి వచ్చేటట్టు నా దేవుడు చేస్తారు
*.అలాగే నా దేవుడు దావీదు గారి జీవితంలో దేవుడు తన యాదర్ధతను రుజువు పరిచారు
*.సౌలు గారు దొరికినప్పుటికి దావీదు గారు ఏమి చేశారు ...తర్వాత సౌలు గారు ఏమి అన్నారు..అది ఈ క్రింద వాక్యాలు చదివితే అర్థం అవుతుంది...
*✳️1 సమూయేలు:24:8-22*
*.ఈరోజు నువ్వు కీర్తనలు 37:7
యెహోవా యెదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము
*.ఆయన నీ జీవితాన్ని మారుస్తారు ....నీ పరిస్థితిని పరిష్కరిస్తారు
*God Bless You*
──── ◉ ────
❛ ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే మీ ~```బంధువులకు```~ , స్నేహితులకు తప్పనిసరిగా ```షేర్``` చెయ్యండి! ❜
❤️
🙏
👍
🙌
🤍
❣
🙇♀
60