𝗦𝗮𝗻𝗮𝘁𝗮𝗻𝗮 Hindu 𝗗𝗛𝗔𝗥𝗠𝗔 ಸನಾತನ ಹಿಂದೂ 🙏
June 20, 2025 at 12:52 AM
*సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత* *_అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు._* సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము. *ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః౹౹* అష్టాంగాలు అంటే... "ఉరసా" అంటే తొడలు, "శిరసా" అంటే తల, "దృష్ట్యా" అనగా కళ్ళు, "మనసా" అనగా హృదయం, "వచసా" అనగా నోరు, "పద్భ్యాం" అనగా పాదములు, "కరాభ్యాం" అనగా చేతులు, "కర్ణాభ్యాం" అంటే చెవులు. ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి.. *స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు* ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది. పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. *_నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం._*
Image from 𝗦𝗮𝗻𝗮𝘁𝗮𝗻𝗮 Hindu 𝗗𝗛𝗔𝗥𝗠𝗔 ಸನಾತನ ಹಿಂದೂ 🙏: *సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత*  *_అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస...
🙏 4

Comments