
Sakshi Telugu News
June 19, 2025 at 05:25 AM
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. తమ ప్రాంతంలో మద్యం బెల్టు షాపు తీసేయాలని హిందూపురం మండలం ముదిరెడ్డిపల్లి గ్రామస్తుల తీర్మానం చేశారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాల వల్ల బయటకు రాలేకపోతున్నామని మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు షాపు తొలగించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మందుబాబుల ఆగడాలపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించాలని ముద్దిరెడ్డిపల్లి వాసులు విజ్ఞప్తి చేశారు.
https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/setback-hindupur-mla-nandamuri-balakrishna-villagers-resolve-shut-liquor
👍
❤️
😂
10