Sakshi Telugu News WhatsApp Channel

Sakshi Telugu News

101.6K subscribers

Verified Channel

About Sakshi Telugu News

For latest news across the globe with 24-hour news coverage in Telugu with a wide range of topics, Please subscribe Sakshi Telugu News

Similar Channels

Swipe to see more

Posts

Sakshi Telugu News
Sakshi Telugu News
6/17/2025, 2:15:21 PM

భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ పర్యటనకు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశముంది. https://www.sakshi.com/telugu-news/sports/suryakumar-yadav-travels-england-surgery-reports-2480481

Sakshi Telugu News
Sakshi Telugu News
6/17/2025, 2:09:07 PM

గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఆ పార్టీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. తాజాగా సంచలన ప్రకటనతో మరొకసారి వార్తల్లోకి వచ్చారు. ఇక ఐక్యంగా కలిసి పని చేద్దామంటూ రాజాసింగ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం(జూన్‌ 17) రాజాసింగ్‌ ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు. https://www.sakshi.com/telugu-news/politics/bjp-mla-raja-singh-says-stand-unity-work-party-2480479

😂 1
Sakshi Telugu News
Sakshi Telugu News
6/18/2025, 1:52:49 AM

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా కూడా ఇరాన్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇరాన్‌పై దాడుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. https://www.sakshi.com/telugu-news/international/donald-trump-plans-joining-israeli-strikes-iranian-nuclear-sites-2481110

Sakshi Telugu News
Sakshi Telugu News
6/18/2025, 1:15:40 AM

మద్యం అక్రమ కేసులో ఆయనకు సంబంధం ఉందని చెప్పాలన్నారు డీజీపీకి లేఖ రాసిన చెవిరెడ్డి పూర్వ గన్‌మెన్‌ మదన్‌ అబద్ధాలు చెప్పనన్నందుకు కొట్టారు.. బూతులు తిట్టారు ముఖం, వీపుపై పిడిగుద్దులు గుద్దారు..చేతి వేళ్లు వెనక్కు విరిచారు తప్పుడు స్టేట్‌మెంట్ల కోసం టార్చర్‌ చూపుతున్న సిట్‌ చెవిరెడ్డి వెంట తిరిగిన వారిని చిత్రవధ చేసి నరకం చూపిస్తున్న వైనం గతంలో గన్‌మెన్లుగా పని చేసిన వారిని చితక బాదిన అధికారులు సిట్‌ విచారణ తీరుతో ఆస్పత్రి పాలైన హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌ ఈ మేరకు హైకోర్టులోనూ పిటిషన్‌.. విచారణ నేటికి వాయిదా https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/chevireddy-bhaskar-reddy-gunmen-madan-reddy-letter-ap-dgp-2481076

👍 2
Sakshi Telugu News
Sakshi Telugu News
6/17/2025, 12:18:27 PM

రైల్వేస్టేషన్‌లో అప్రమత్తంగా ఉండాలని అటురైల్వే అధికారులు,ఇతరులు చెబుతూనే ఉంటారు. రైలు రన్నింగ్ లో ఉండగానే దిగేందుకు ఎక్కేందుకు ప్రయత్నించవద్దని, రైలు వస్తున్నపుడు ప్లాట్‌ఫాం కు దూరంగా ఉండాలనే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. https://www.sakshi.com/telugu-news/family/dad-shields-his-daughter-his-body-after-she-fell-railway-platform-video-viral

Sakshi Telugu News
Sakshi Telugu News
6/18/2025, 1:48:07 AM

https://www.sakshi.com/photos/movies/ananthika-8-vasantalu-pre-release-event-photos-2481079

Sakshi Telugu News
Sakshi Telugu News
6/18/2025, 4:26:07 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 89 పాయింట్లు లాభపడి 24,942కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 259 ప్లాయింట్లు పెరిగి 81,836 వద్ద ట్రేడవుతోంది. https://www.sakshi.com/telugu-news/business/stock-market-updates-june-18-2025-2481269

Sakshi Telugu News
Sakshi Telugu News
6/18/2025, 1:57:59 AM

న్యూఢిల్లీ: భారత్‌-​కెనడాల మధ్య సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని, ‍ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ‍ప్రధాని నరేంద​ర్‌ మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలుసుకున్నారు. గత ఏడాది అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో క్షీణించిన సంబంధాలు తాజా ద్వైపాక్షిక సమావేశాలతో బలోపేతమవుతాయని భారత్‌ భావిస్తోంది. https://www.sakshi.com/telugu-news/international/india-canada-ties-revival-pm-meets-mark-carney-2481152

👍 2
Sakshi Telugu News
Sakshi Telugu News
6/17/2025, 1:31:17 PM

*చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం* - కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఫైర్‌ - రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇదే నిదర్శనం - చంద్రబాబు .. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? - మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? - కుప్పం నియోజకవర్గంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే - ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు

👍 😢 😂 🙏 20
Sakshi Telugu News
Sakshi Telugu News
6/17/2025, 12:14:24 PM

గ్రీన్ లాజిస్టిక్స్, సమర్థవంతమైన వెహికల్ డిస్పాచ్‌ కోసం మారుతి సుజుకి తన మానేసర్ ఫెసిలిటీలో భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్‌ను ప్రారంభించింది. లాజిస్టిక్స్‌లో కార్బన్ ఉద్గారాలను, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం, రహదారి రద్దీని కట్టడి చేయడం ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. https://www.sakshi.com/telugu-news/business/maruti-suzuki-unveils-india-largest-plant-railway-siding-manesar-2480467

👍 2
Link copied to clipboard!