
Sakshi Telugu News
June 20, 2025 at 11:32 AM
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేస్ బౌలర్లకు పిచ్ అనుకూలించే అవకాశమున్నందన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌తో యువ ఆటగాడు సాయిసుదర్శన్ భారత జట్టు తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. అదేవిధంగా కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి మళ్లీ టీమిండియా తరపున ఆడుతున్నాడు.
https://www.sakshi.com/telugu-news/sports/why-shardul-thakur-playing-over-nitish-kumar-reddy-england-vs-india-1st-test