
AP News
June 16, 2025 at 12:26 PM
చిత్తూరు జిల్లా
నగరి లో 5కోట్ల మందికి వెన్నుపోటు పుస్తకం ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆర్ కే.రోజా, కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఆర్. కే.రోజా, మాజీ మంత్రి కామెంట్స్
కూటమి నాయకులు మంచి ప్రభుత్వము అంటున్నారు, ప్రజలు మాత్రం ముంచే ప్రభుత్వం అంటున్నారు
సూపర్ సిక్స్ చేసేశాము అని నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారు
చంద్రబాబు కు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య, వెన్నుపోటు పొడవటం కూడా వెన్నతో పెట్టిన విద్య అని ముక్త కంఠం తో చెప్తున్నారు
చంద్రబాబు ఇస్తామని చెప్పిన సూపర్ సిక్స్ అమలు లేదు, నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ లేదు, ఉచిత బస్సు లేదు
ప్రజలకు సెంటు భూమి ఇవ్వలేదు
సూపర్ సిక్స్ ఎగనామం పెట్టీ, శుద్ధ దండగ పాలన ప్రజలు అంటున్నారు
పొదిలి పర్యటన తర్వాత భయపడి తల్లికి వందనం హడావిడిగా విడుదల చేశారు
87 లక్షలు అందానికి పడాలి ఉండగా 57 లక్షలు మందికి మాత్రమే వేశారు
తల్లికి వందనం కాదు, తల్లికి దండగ అంటున్నారు
ఒకే ఆధార్ నెంబర్ తో 54 మందికి, 74మందికి ఎలా ఇచ్చారు
గతంలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో అమ్మఒడి వెయ్యి రూపాయలు మెయిటెన్స్ వెయ్యి రూపాయలు తీసుకుంటే.. ఈరోజు రెండు వేలు వసూళ్లు చేస్తున్నారు
ఈరోజు రెండు వేలు ఎక్కడికి వెళ్ళాయి, ఒక్క బాత్రూమ్ కట్టలేదు..
ఆ రెండు వేలు ఎక్కడికి వెళ్ళాయి చెప్పాలి
టెన్త్ క్లాస్ పరీక్ష పరీక్ష పత్రాలు దిద్దటం మీకు చేతకాదు,
కేంద్రీయ విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు తల్లికి వదనం ఎగ్గొట్టారు
రాష్ట్రంలో బటన్ నొక్కడం మూలాన ఉన్న ముసలియమ్మ నొక్కుతుంది అన్నారం. మీరు ఒక్క ఒక్క బటన్ నొక్కడం కోసం..నా.....నా....ఇబ్బందులు పడ్డారు
రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టీ..ఎల్లో మానిఫెస్టో అమలు చేయండి
రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయి డ్రగ్స్ పెరిగిపోయాయి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పై తప్పుడు కేసుకు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారు
కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి, మోసం ఎండగడతాం