
Vedic chants
May 23, 2025 at 02:45 AM
L*కాలం - అనుకూలం*
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 23 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: *ఏకాదశి రా.8.16 కు* తదుపరి *ద్వాదశి 24 సా.5.54 కు*
వారం: *భృగువారము (శుక్రవారం)*
నక్షత్రం: *ఉత్తరాభాద్ర మ.12.27 కు* తదుపరి *రేవతి 24 ఉ.10.56 కు*
యోగం: *ప్రీతి సా.6:36 కు* తదుపరి *ఆయుష్మాన్ 24 సా.3:00 కు*
కరణం: *బవ ఉ.11.55 కు* తదుపరి *బాలవ రా.10.30 కు*
రాహుకాలం: *ఉ. 10.30 - 12.00 కు*
దుర్ముహూర్తం: *ఉ.8:20-9:12 కు, మ. 12:38-1:30 కు*
వర్జ్యం: *రా.11.41-1.11 కు*
అమృతకాలం: *ఉ.11:35-01:04 కు*
సూర్యోదయం: *ఉ. 5:31 కు*
సూర్యాస్తమయం: *సా. 6:21 కు*
🕉️ *వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి* 🕉️
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణం రేపు చేయాలి.
*గురుబోధ:*
1) వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి ‘వరూధిని’ అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది.
2) ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలి. తరువాత హరి పూజ చేయాలి. హరి పూజ చేయని ఏకాదశి వ్రతం వృథా.
3) ఈరోజు విష్ణువుకు ప్రత్యేకంగా గంధమును అరగదీసి, విష్ణు విగ్రహం పైన లేదా సాలగ్రామం పైన పూయాలి. గంధం పూసాక షోడశోపచారపూజ చేయాలి. అలా చేస్తే భయంకర పాపాలు తొలగి మహా పుణ్యం లభిస్తుంది. అనంతరం పుష్పములతో కానీ తులసి దళములతో కానీ బిల్వదళములతో కానీ విష్ణు లేదా కృష్ణ అష్టోత్తరశతనామాలతో పూజించాలి. పురుష సూక్తం, శ్రీ సూక్తం చదవాలి. ఏదైనా ఒక తీపి పదార్ధం నివేదించాలి.