Vedic chants
Vedic chants
May 23, 2025 at 11:58 PM
*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 24 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం తిథి: *ద్వాదశి సా.5.54 కు* తదుపరి *త్రయోదశి 25 మ.3.25 కు* వారం: *స్థిరవారము (శనివారం)* నక్షత్రం: *రేవతి ఉ.10.56 కు* తదుపరి *అశ్వని 25 ఉ.9.17 కు* యోగం: *ఆయుష్మాన్ సా.3:00 కు* తదుపరి *సౌభాగ్య 25 ఉ.11:06 కు* కరణం: *కౌలవ ఉ.8.58 కు* తదుపరి *తైతుల రా.7.20 కు* రాహుకాలం: *ఉ. 09.00 - 10.30 కు* దుర్ముహూర్తం: *ఉ.7:29-8:20 కు* వర్జ్యం: *లేదు* అమృతకాలం: *ఉ.11:37-01:04 కు* సూర్యోదయం: *ఉ. 5:31 కు* సూర్యాస్తమయం: *సా. 6:21 కు* ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చెయ్యాలి. *గురుబోధ:* ఎన్నో వేలజన్మల సంస్కారం, పుణ్యం ఉంటే గాని తీర్థయాత్రలు చేయలేము. పైగా సద్గురువులతో యాత్ర చేసే భాగ్యం మరింత అదృష్టం. అటువంటి పుణ్య ప్రదేశాలలో ఇతరుల పై చాడీలు చెప్పడం, కోపగించుకోవడం, ఏదో ఒక వంక పెట్టి అసంతృప్తి వ్యక్తపరచడం, విరుచుకుపడడం చేయరాదు. సాధ్యమైనంత వరకు ఏదో ఒక నామ, జప, పారాయణం, పురాణ శ్రవణంతో కాలం గడపాలి. తీర్థయాత్రలు చేయడం కుదరనప్పుడు తీర్థయాత్రలు చేసేవారికి ధన, వస్తు రూపములో ఎంతో కొంత సహాయం చేసినవారికి కూడా ఆ తీర్థయాత్రలు చేసిన ఫలితం కొంత వస్తుంది.

Comments