
Vedic chants
May 28, 2025 at 02:10 AM
*కాలం - అనుకూలం*
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 28 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: *జ్యేష్ట శుద్ధ పాడ్యమి ఉ.8.25 కు* తదుపరి *విదియ 29 ఉ.6.20*
వారం: *సౌమ్యవారము (బుధవారం)*
నక్షత్రం: *మృగశిర రా.3.12 కు * తదుపరి *ఆరుద్ర 29 రా.2.15 కు*
యోగం: *ధృతి సా.7:08 కు* తదుపరి *శూల 29 సా.3:46 కు*
కరణం: *బాలవ సా.6:45 కు* తదుపరి *కౌలవ రా.1.25 కు*
రాహుకాలం: *మ. 12.00 - 01.30 కు*
దుర్ముహూర్తం: *ఉ.11:47-12:39 కు*
వర్జ్యం: *ఉ.9.22-10.52 కు*
అమృతకాలం: *సా. 4.33-5:59 కు*
సూర్యోదయం: *ఉ. 5:29 కు*
సూర్యాస్తమయం: *సా. 6:25 కు*
*గురుబోధ:*
శ్లో. కరవీర!వృషావాస! నమస్తే భానువల్లభ
దంభోళి మృడ దుర్గాది దేవానాం సతతం ప్రియం!
జ్యేష్ఠ శుక్ల పాడ్యమినాడు దేవాలయ సంబంధమైన ప్రాంతంలో పూచిన గన్నేరు పువ్వును గంధం, కుంకుమ జల్లి భక్తితో నమస్కరించి ఈ పై శ్లోకం చదువుకోవాలి. ఇలా పలికి, ఆ పుష్పాన్ని ఆ ప్రాంగణమునకు చెందిన అర్చకులకు లేక పురోహితులకు దానం చెయ్యాలి. ఇలా చేసిన వారికి అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం, జ్ఞాపక శక్తి లభిస్తాయి.