
Vedic chants
May 29, 2025 at 01:44 AM
*కాలం - అనుకూలం*
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 29 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: *విదియ ఉ.6.20 కు* తదుపరి *తదియ 30 తె.4.33 కు*
వారం: *బృహస్పతివారము (గురువారం)*
నక్షత్రం: *ఆరుద్ర రా.2.15 కు* తదుపరి *పునర్వసు 30 రా.1.35 కు*
యోగం: *శూల మ.3:46 కు* తదుపరి *గండ మ.12:56 కు*
కరణం: *తైతుల మ.12.32 కు* తదుపరి *గరజి రా.11.18 కు*
రాహుకాలం: *మ. 01.30 - 03.00 కు*
దుర్ముహూర్తం: *ఉ.10:04-10:55 కు, మ. 3:14-4:06 కు*
వర్జ్యం: *ఉ.1.47-1.17 కు*
అమృతకాలం: *మ. 01.24 - 02.53 కు*
సూర్యోదయం: *ఉ. 5:29 కు*
సూర్యాస్తమయం: *సా. 6:25 కు*
*మహారాణాప్రతాప్ జయంతి*
*గురుబోధ:*
జ్యేష్ఠ శుక్ల విదియ నాడు సూర్యుని పూజిస్తే ఆరోగ్యం, వ్యాకరణ పాండిత్యం లభిస్తాయి. సూర్యభగవానుని ప్రీత్యర్థం ఆదిత్యస్తవము లేదా ఆదిత్య హృదయం పారాయణం కానీ శ్రవణం కానీ చేయడం వలన అన్నింటా విజయం లభిస్తుంది, సకలశుభప్రదం.