Vedic chants
Vedic chants
May 30, 2025 at 01:44 AM
*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 30 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం తిథి: *చతుర్థి రా.3.27 కు* తదుపరి *పంచమి 31 రా.2.16 కు* వారం: *భృగువారము (శుక్రవారం)* నక్షత్రం: *పునర్వసు రా.1.35 కు* తదుపరి *పుష్యమి 31 రా.1.23 కు* యోగం: *గండ సా.12:56 కు* తదుపరి *వృద్ధి 31 ఉ.10:43 కు* కరణం: *వణిజ ఉ. 10:15 కు* తదుపరి *విష్టి రా.8.23 కు* రాహుకాలం: *ఉ. 10.30 - 12.00 కు* దుర్ముహూర్తం: *ఉ.8:20-9:12 కు, మ. 12:39-1:31 కు* వర్జ్యం: *ఉ.1.55-3.15 కు* అమృతకాలం: *రా. 07.12 - 08.43 కు* సూర్యోదయం: *ఉ. 5:29 కు* సూర్యాస్తమయం: *సా. 6:26 కు* *గురుబోధ:* జ్యేష్ఠమాసానికి శ్రేష్ఠమాసం అని పేరు ఎందువలన వచ్చిందంటే జ్యేష్ఠమాసం ఉత్తరాయణ కాలంలో సుముహూర్తాలు ఉండే మాసములలో చివరి మాసం (మూఢమి వస్తే లెక్కలోకి రాదు). దేవాలయాల ప్రతిష్ఠలు, ఉపనయనాలు, వివాహాలు జరుగుతున్న చిట్టచివరి మాసం అని భీష్ముని వంటి వారు చెప్పారు. అటువంటి అపూర్వమాసంలో శ్రీమన్నారాయణుడిని, పరమశివుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. యథాశక్తి దానధర్మాలు చేయడం సకల పాపహరం.

Comments