Vedic chants
June 2, 2025 at 02:02 AM
*కాలం - అనుకూలం*
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 02 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: *సప్తమి రా.1.53 కు* తదుపరి *అష్టమి 3 రా.2.27 కు*
వారం: *ఇందువారము (సోమవారం)*
నక్షత్రం: *మఖ రా.2.23 కు * తదుపరి *పుబ్బ 3 రా.3.38 కు*
యోగం: *వ్యాఘాత ఉ.8:20 కు* తదుపరి *హర్షణ 3 ఉ.8:08 కు*
కరణం: *గరజి ఉ. 8.11 కు* తదుపరి *వణిజ రా.8.35 కు*
రాహుకాలం: *ఉ. 07.30 - 09.00 కు*
దుర్ముహూర్తం: *మ.12:40-1:31 కు, మ. 3:15-4:07 కు*
వర్జ్యం: *మ.2.02-3.40 కు*
అమృతకాలం: *రా. 08.23 - 10.04 కు*
సూర్యోదయం: *ఉ. 5:28 కు*
సూర్యాస్తమయం: *సా. 6:27 కు*
*గురుబోధ:*
మన పేరు మీద మన పిల్లల పేరు మీద జీవితంలో ఒక్కసారైనా భాగవత సప్తాహం చేయించుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.అట్టివారికి వారి కుటుంబసభ్యులు లేక ఆప్తులు వారి పేరున భాగవత సప్తాహం జరిపించటమే ఉత్తమమార్గం.