Vedic chants
June 3, 2025 at 01:23 AM
*కాలం - అనుకూలం*
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 03 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: *అష్టమి రా.2.27 కు* తదుపరి *నవమి 4 రా.3.23 కు*
వారం: *భౌమవారము (మంగళవారం)*
నక్షత్రం: *పుబ్బ రా.3.38 కు* తదుపరి *ఉత్తర 5 తె.5.22 కు*
యోగం: *హర్షణ ఉ.8:08 కు* తదుపరి *వజ్ర 4 ఉ.8:28 కు*
కరణం: *విష్టి ఉ. 8.10 కు* తదుపరి *బవ రా.8.56 కు*
రాహుకాలం: *మ. 03.00 - 04.30 కు*
దుర్ముహూర్తం: *ఉ.8:20-9:12 కు, మ. 11:08-11:52 కు*
వర్జ్యం: *ఉ.10.47-12.28 కు*
అమృతకాలం: *సా.06.01 - 07.46 కు*
సూర్యోదయం: *ఉ. 5:28 కు*
సూర్యాస్తమయం: *సా. 6:27 కు*
🕉️ *జ్యేష్ఠ శుక్ల అష్టమి*🕉️
*గురుబోధ:*
జ్యేష్ఠమాసం లో శుక్లపక్షంలో వచ్చే అష్టమి శనిదేవుడికి, కాలభైరవునికి ప్రీతిపాత్రమైనది. ఈ రోజు చేయవలసిన విధి విధానాలు: 1) శివ పంచాక్షరి కానీ శనీశ్వర స్తోత్రం గాని చదువుకోవాలి. 2) శివాలయంలో గాని, నవగ్రహ ఆలయంలో గాని నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. - (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం)
🙏
2