Vedic chants
June 10, 2025 at 01:23 AM
*కాలం - అనుకూలం*
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 10 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: *చతుర్దశి మ.12.44 కు* తదుపరి *జ్యేష్ఠ పూర్ణిమ 11 మ.2.17 కు*
వారం: *భౌమవారము (మంగళవారం)*
నక్షత్రం: *అనూరాధ సా.5.43 కు* తదుపరి *జ్యేష్ఠ 11 రా.7.40 కు*
యోగం: *సిద్ధ సా.1:44 కు* తదుపరి *సాధ్య 11 సా.2:03 కు*
కరణం: *వణిజ ఉ. 11.36 కు* తదుపరి *విష్టి రా 12.27 కు*
రాహుకాలం: *మ. 03.00 - 04.30 కు*
దుర్ముహూర్తం: *ఉ.8:21-9:13 కు, మ. 11:09-11:53 కు*
వర్జ్యం: *రా.11.49-1.33 కు*
అమృతకాలం: *ఉ.06:32 - 08:18 కు*
సూర్యోదయం: *ఉ. 5:28 కు*
సూర్యాస్తమయం: *సా. 6:28 కు*
*గురుబోధ:*
అగస్త్య మహర్షిని రాత్రి పడుకునే ముందు తలుచుకుని పడుకుంటే దుస్స్వప్నాలు రావు, అప మృత్యు భయం ఉండదు, యమభయం ఉండదు. అగస్త్యుడు దక్షిణం దిక్కున నిలబడి రాత్రిపూట యమభయం, మృత్యుభయం లేకుండా చేస్తాడు. పూర్వం కొత్తగా వాహనములు తీసుకున్నప్పుడు అగస్త్య మహర్షిని తలుచుకొని, ప్రదక్షిణ చేసి అందులో ప్రయాణం చేసేవారు. ఇంటిలో నుండి బయటకు ప్రయాణమై వెళ్లేటప్పుడు అగస్త్య మహర్షికి నమస్కారము చేసుకొని (ముమ్మారు అగస్త్యం నమామి అనుకొని) ప్రయాణానికి వెళితే అటువంటి వారికి యాక్సిడెంట్ భయం ఉండదు.