Vedic chants
Vedic chants
June 16, 2025 at 02:08 AM
*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 16 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం తిథి: *పంచమి మ.3.10 కు* తదుపరి *షష్ఠి 17 మ.1.56 కు* వారం: *ఇందువారము (సోమవారం)* నక్షత్రం: *ధనిష్ఠ రా.11.34 కు* తదుపరి *శతభిషం 17 రా.10.57 కు* యోగం: *వైధృతి ఉ.11:06 కు* తదుపరి *విష్కంభ 17 ఉ.8:34 కు* కరణం: *తైతుల మ.3.32 కు* తదుపరి *గరజి రా 3.12 కు* రాహుకాలం: *ఉ. 07.30 - 09.00 కు* దుర్ముహూర్తం: *మ.12:42-1:34 కు, మ. 3:19-4:11 కు* వర్జ్యం: *లేదు* అమృతకాలం: *మ.02:43-04:20 కు* సూర్యోదయం: *ఉ. 5:28 కు* సూర్యాస్తమయం: *సా. 6:30 కు* *గురుబోధ:* అన్నం వండేటప్పుడు తప్పక భగవన్నామం లేదా పురాణకథలు వింటూ చేయాలి. అప్పుడు తినే అన్నం అమృతతుల్యం అవుతుంది. మానసిక, శారీరిక అనారోగ్యాన్ని తొలగిస్తుంది. అన్నం వండేవారు ఏ ఆలోచనలతో వండారో ఆ ఆలోచనలు అన్నం తిన్నవారి మీద ప్రభావం చూపుతాయి. అందుకే మన పెద్దలు ఆచారముల మీద మక్కువ కలిగినవారు సాధ్యమైనంతవరకు బయట వండిన పదార్థాలను తినడానికి ఇష్టపడరు.

Comments