Vedic chants
Vedic chants
June 20, 2025 at 03:16 AM
*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 20 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం తిథి: *నవమి ఉ.8.12 కు* తదుపరి *దశమి 21 ఉ.5.44 తదుపరి ఏకాదశి 21 రా.3.17 కు* వారం: *భృగువారము (శుక్రవారం)* నక్షత్రం: *రేవతి రా.7.13 కు * తదుపరి *అశ్వని 21 సా.5.35 కు* యోగం: *శోభన సా.11:46 కు* తదుపరి *అతిగండ 21 సా.8:28 కు* కరణం: *గరజి ఉ.8.49 కు* తదుపరి *వణిజ రా 8.37 కు* రాహుకాలం: *ఉ. 10.30 - 12.00 కు* దుర్ముహూర్తం: *ఉ.8:23-9:15 కు, మ. 12:43-1:35 కు* వర్జ్యం: *ఉ.7.57-9.27 కు* అమృతకాలం: *రా.07:30-09:00 కు* సూర్యోదయం: *ఉ. 5:30కు* సూర్యాస్తమయం: *సా. 6:32 కు* *గురుబోధ:* మాటతో కానీ చేతతో కానీ ఎవరినీ కూడా కష్టపెట్టకుండా, బాధపెట్టకుండా ఉండాలి. అందులోనూ ధర్మం మీద నిలబడే వారిని అస్సలు ఏ విధమైన బాధకు గురి చేయకూడదు. వారు కానీ వారి కుటుంబంలో స్త్రీలుగాని బాధపడి కంట కన్నీరు పెడితే అది లోకానికి శ్రేయస్కరము కాదు. "ఆర్య హింస చేయనడవు కాదే" అని భాగవతం చెప్పింది. అందుకనే పవిత్రంగా జీవితాన్ని గడుపుతున్న వారిని ఎట్టి పరిస్థితులలోనూ బాధపెట్టకూడదు. సాధ్యమైనంత వరకు ఏ ఇతర జీవినీ కూడా బాధపెట్టకుండా ఉండాలి.

Comments