
Dev Tv
June 16, 2025 at 02:30 AM
*నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన*
విశాఖపట్నం జూన్ 16,2025:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన సమీక్షించనున్నారు.
బీచ్ రోడ్‌లో జరిగే యోగా డే ప్రధాన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్న చంద్రబాబు, మంత్రుల కమిటీతో పాటు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల పురోగతిపై సమీక్ష జరగనుంది.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
