
Dev Tv
June 21, 2025 at 07:06 AM
*విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డు గౌరవం*
విశాఖపట్నం జూన్ 21,2025: విశాఖపట్నం మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర విశాఖలో నిర్వహించిన భారీ యోగా కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఒకేచోట 3.20 లక్షల మంది పాల్గొన్న యోగాసన ప్రదర్శన ప్రపంచ రికార్డుగా నమోదైంది.
ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు కూడా భారీగా పాల్గొని సూర్యనమస్కారాలతో మరో రికార్డు సాధించారు. ఈ అరుదైన ఘనతకు గుర్తింపుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ధ్రువపత్రాలను అందజేశారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
