TGEMPLOYEES
June 11, 2025 at 05:07 AM
📙✍️
<><><><><><><><><><><><>
*సందేహాలు - సమాధానాలు - 6*
◼◼◼◼◼◼◼◼◼◼
*51. ❓ప్రశ్న:*
నేను మున్సిపాలిటీ లో టీచర్ గా పని చేస్తున్నాను.నేను ఏ ఏ టెస్టులు పాస్ కావాలి?
✅జవాబు:*
మున్సిపల్ సర్వీస్ రూల్స్ వచ్చిన 7.12.2016 నాటికి HM a/c టెస్టు పాస్ అయి ఉంటే 3 ఇయర్స్ వరకు EOT, GOT పాస్ కానవసరం లేదు.తదుపరి SA లు 12 ఇయర్స్ స్కేల్ కొరకు,SGT లు 24 ఇయర్స్ స్కేల్ కొరకు EOT, GOT తప్పక పాస్ కావాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*52. ❓ప్రశ్న:*
తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో రాయాలా??
✅జవాబు:*
విద్యా శాఖ ఉత్తర్వులు మెమో.7679 తేదీ:14.9.2010 ప్రకారం తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో తప్పక రాయాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*53. ❓ప్రశ్న:*
నేను 24 ఇయర్స్ స్కేల్ పొందిన పిదప పదోన్నతి పొందాను.నా వేతనం FR--22బి ప్రకారం నిర్ణయించబడే అవకాశం ఉందా??
✅జవాబు:*
లేదు.మీకు FR--22ఎ(i) ప్రకారం మాత్రమే వేతన నిర్ణయం జరుగుతు0ది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*54. ❓ప్రశ్న:*
మొదటి బిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు.రెండవ బిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను.ప్రస్తుతం మూడవ బిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా??
✅జవాబు:*
అవకాశం లేదు. జీఓ.231 తేదీ:16.9.2005 ప్రకారం పితృత్వ సెలవు ఇద్దరు జీవించియున్న పెద్ద పిల్లలు కి మాత్రమే వర్తిస్తుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*55. ❓ప్రశ్న:*
ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా ?
✅జవాబు:*
G.O.Ms.No.802 తేది:21.4.1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*56. ❓ప్రశ్న:*
ప్రసూతి సెలవులో ఉన్నవారికి జీతం విధుల్లో చేరిన తరువాత ఇస్తారా? ప్రతినెలా ఇవ్వవచ్చునా ?
✅జవాబు:*
A.P.Fundamental Rule 74(a) క్రింద గల సబ్ రూల్ 32 ప్రకారంగా "Leave Salary payable in India after the end of each calender month" కాబట్టి నెలనెలా జీతం చెల్లించవచ్చు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*57. ❓ప్రశ్న:*
సాధారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ను మంజూరు చేయకుండా నిలుపుదల చెయ్యవచ్చునా ?
✅జవాబు:*
FR-24 లో "Increment should be drawn as a matter of course,unless it is withheld" అని ఉంది.క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారి నుండి ఇంక్రిమెంటు నిలుపుదల చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే తప్ప వార్షిక ఇంక్రిమెంటు యథావిధిగా మంజూరు చేయాల్సిందే.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*58. ❓ప్రశ్న:*
కారుణ్య నియామక పథకం క్రింద ఉద్యోగం పొందిన ఆమెకు భర్త తరఫున కుటుంబ పెన్షన్ వస్తుందా? డి.ఏ రెండిటిపైనా చెల్లిస్తారా?
✅జవాబు:*
కుటుంబ పెన్షన్ వస్తుంది.కాని G.O.Ms.No.125 F&P తేది:01.09.2000 ప్రకారం రెండిటిపైన కరువుభత్యాలు రావు.అయితే రెండింటిలో ఏది లాభకరమో అది ఎంచుకునే అవకాశం సదరు ఉద్యోగికి ఉన్నది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*59. ❓ప్రశ్న:*
ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన,ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ?
✅జవాబు:*
జమ చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*60. ❓ప్రశ్న:*
నేను ఒక CPS ఉద్యోగిని. ఏ సందర్భంలో50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్ క్లైం చేసుకోవచ్చు.
✅జవాబు:*
మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది. (eఫైలింగ్ చేస్తే)లేదంటే వర్తించదు.
☞ *క్రింది లింక్ ద్వారా మన What's App Channel ను Follow అయ్యి తాజా సమాచారం వెంటనే పొందవచ్చు*
https://whatsapp.com/channel/0029VaCtKDCHLHQQd6oMTG2e
☞ **పై లింక్ పై చేసి Top Right Corner లో Follow పై క్లిక్ చేసి, వెంటనే బెల్ గుర్తు🔔 పై క్లిక్ చేయాలి*
👍
❤
❤️
😮
8