TGEMPLOYEES
June 16, 2025 at 07:15 AM
*సందేహాలు -TGEMPLOYEES - సమాధానాలు*
*1. ప్రశ్న:*
ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??
*✅జవాబు:*
అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*2. ప్రశ్న:*
LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??
*✅జవాబు:*
LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*3. ప్రశ్న:*
నేను 1996 డిసెంబరు లో sgt గా చేరాను.ఐతే 2001 లో 142 రోజులు,2005 లో 90 రోజులు అనారోగ్యంతో జీత నష్టం (ఇఓఎల్) సెలవు పెట్టాను. ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్టుపోన్ అయ్యింది. ఐతే ఇంక్రిమెంట్ ను డిసెంబరు కి మార్చుకొనే అవకాశం లేదా??
*✅జవాబు:*
జీఓ.43; తేదీ:5.2.76 ప్రకారం డిసెంబరుకి మార్చుకోవచ్చు.ఐతే సంబంధిత ప్రతిపాదనలు వైద్య ధ్రువపత్రాలతో మరియు SR తో deo ద్వారా DSE కి పంపాలి.180 రోజుల వరకు DSE, అంతకు మించిన కాలానికి విద్యా శాఖ కార్యదర్శి అనుమతితో ఈఓయల్ కాలం ఇంక్రిమెంట్కి సర్వీసు గా పరిగణించబడుతుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*4. ప్రశ్న:*
సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి బ్రతికేది ఎలా??
*✅జవాబు:*
సస్పెండ్ పీరియడ్ లో సబ్ స్టెన్స్ అలవెన్సు కింద సగం జీతం(హాఫ్ పే,హాఫ్ డీఏ,హాఫ్ హెచ్ఆర్ఏ)ఇస్తారు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*5. ప్రశ్న:*
ఒక ఉద్యోగి 9 ఇయర్స్ పాటు ఉద్యోగానికి గైరు హాజరు అయ్యాడు.అతనికి మరల పోస్టింగ్ ఇస్తారా??
*✅జవాబు:*
FR.18 మరియు aplr.1933 లోని రూల్ 5 ప్రకారం ఒక ఉద్యోగి 5 ఇయర్స్ పాటు గైర్హాజరు అయితే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా భావించాలి.తిరిగి చేరాలి అంటే విద్యాశాఖ కార్యదర్శి నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*6. ప్రశ్న:*
నేను SGT ను.75% అంగవైకల్యం తో బాధపడుతున్నాను.నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను.నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. డిగ్రీ,బీ.ఎడ్ చేశాడు. నా ఉద్యోగం నా తమ్ముడు కి ఇప్పించవచ్చా??
*✅జవాబు:*
మీ ఉద్యోగం ఎవ్వరికీ నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు. కానీ జీఓ.66 జీఏడీ తేదీ:23.10.2008 ప్రకారం మీరు అనారోగ్యంతో విధులు నిర్వర్హించలేక పోతున్నారని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన, మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేషన్ కింద రిటైర్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ పోస్టు కారుణ్య నియామకం కోటాలో ఇవ్వటానికి అవకాశం ఉంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*7. ప్రశ్న:*
ఉన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవి సెలవుల్లో ssc అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల విధులను ఎవరికి అప్పగించాలి??
*✅జవాబు:*
ఆర్.సి.132 తేదీ:14.5.14 ప్రకారం బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవిలో ssc భాద్యతను ఆ ఉన్నత పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*8. ప్రశ్న:*
విద్యాహక్కు చట్టంలోని ఏ నిబంధన ప్రకారం 1 నుండి 8వ తరగతి వరకు పిల్లలను నేరుగా చేర్చుకోవచ్చు??
*✅జవాబు:*
విద్యాహక్కు చట్టం 2009 లోని 2వ అధ్యాయం 4వ సెక్షన్ ప్రకారం 6--14 వయస్సు గల పిల్లలను వారి వయస్సుకి తగిన విధంగా 1--8 తరగతులలో నేరుగా చేర్చుకోవలసి ఉంటుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*9. ప్రశ్న:*
గత సంవత్సరం 9వ తరగతి లో ముగ్గురు పిల్లలు వార్షిక పరీక్షలు రాయలేదు. కనీసం 20% హాజరు కూడా లేదు. వారిని ఈ సంవత్సరం 10 లోకి చేర్చుకోవచ్చా??
*✅జవాబు:*
9,10 తరగతులు విద్యాహక్కు చట్టం పరిధిలోకి రావు.కావున కనీస హాజరు లేకుండా పై తరగతికి ప్రమోట్ చేయకూడదు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*10. ప్రశ్న:*
ఒక LFL HM కి కన్వేయన్స్ అలవెన్సు ఎవరు మంజూరు చేయాలి??
*✅జవాబు:*
జీఓ.40 తేదీ:7.2.02 ప్రకారం మండల పరిషత్ యాజమాన్యం లోని స్కూళ్ళు కి MEO నే కన్వేయన్స్ అలవెన్సు మంజూరు చేయాలి.
☞ *క్రింది లింక్ ద్వారా మన What's App Channel ను Follow అయ్యి తాజా సమాచారం వెంటనే పొందవచ్చు*
https://whatsapp.com/channel/0029VaCtKDCHLHQQd6oMTG2e
☞ **పై లింక్ పై చేసి Top Right Corner లో Follow పై క్లిక్ చేసి, వెంటనే బెల్ గుర్తు🔔 పై క్లిక్ చేయాలి*
👏
👌
3