TGEMPLOYEES
June 17, 2025 at 12:58 AM
*🔊ఎంహెచ్‌ఎం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం* *🍥నిమ్స్, న్యూస్‌టుడే: నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో మాస్టర్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఎం) కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ నిమ్మ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల కోర్సు తర్వాత ఆర్నెల్ల పాటు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందని, 20 సీట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. డిగ్రీ కలిగిన అభ్యర్థులు ఈ నెల 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, ప్రతులను జులై 2 లోపు ఆసుపత్రిలో ఇవ్వాలని సూచించారు.*

Comments