TGEMPLOYEES
June 18, 2025 at 01:43 AM
*🔊గ్రంథాలయ ఉద్యోగుల కేడర్ విభజనకు అనుమతి*
*🔶సీఎం పరిశీలనకు ‘మోడల్ స్కూల్’ దస్త్రం*
*🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రంథాలయ పరిషత్తు ఉద్యోగులకు రాష్ట్రపతి ఉత్తర్వులు-2018ని వర్తింపజేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. అధిక శాతం శాఖలు, విభాగాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి జీఓ 317 ప్రకారం ఉద్యోగులను జిల్లా, జోన్, మల్టీజోన్, రాష్ట్రస్థాయి కేడర్‌గా విభజించారు. గ్రంథాలయ ఉద్యోగులను మాత్రం విభజించలేదు. ఫలితంగా వారికి బదిలీలు, పదోన్నతులు లేకుండా పోయాయి. అధికారులు పంపిన దస్త్రంపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేసిన నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి అవసరమైన ప్రక్రియను గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ చేపడతారని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదే తరహాలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి సంబంధించిన దస్త్రం ఈ నెల 16వ తేదీన సీఎం పరిశీలనకు చేరుకుంది. త్వరలో దీనికి కూడా ఆమోదం లభించనుంది. ఫలితంగా వందల మంది ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలు పొందనున్నారు.*