
ManaTDP App - Official
June 17, 2025 at 04:17 AM
బ్యాంకుల దగ్గర జాతరలు
డబ్బులు తీసుకునే స్లిప్పుల్లోకి తొంగి చూస్తూ, "మీకు ఒకరేనా? ఇద్దరా? ముగ్గురా? నలుగురా? అమ్మో, మీకు ఐదుగురా?" అని కేషియర్లు ఆరా తీస్తుంటే... "అవునండి, నా పిల్లలు బాగా చదువుకుంటారు, ఇక మాకు చదువుల కష్టాలు లేవు" అని మొట్టమొదటిసారిగా గర్వంగా, ఆనందంతో చెప్పుకున్న తల్లుల మాటలు.
"ఇంకేం అక్కా, మీకు రూ. 13,000, మీకు రూ. 26,000, మీకు రూ. 39,000, మీకు రూ. 52,000, మీకు రూ. 65,000" అంటూ డబ్బులు చేతికి అందిస్తుంటే... "బాబు బంగారం, సరిగ్గా టయానికి మా కష్టాలు తీర్చాడు సారూ!" అని మనస్ఫూర్తిగా చెప్పే కృతజ్ఞతలు.
ఆ జాతర మధ్యలో, సెల్ ఫోన్లలో అరుస్తూ.. "డబ్బులు పడ్డాయ్ రోయ్!", "తల్లికి వందనం" డబ్బులు డ్రా చేసుకోవడానికి తండోపతండాలుగా తరలివచ్చిన తల్లుల గుంపు మధ్య చిక్కుకుపోయాం" అంటూ సరదాగా పంచుకుంటున్న అనుభవాలు.
ఉబ్బరానికి ఈనో ప్యాకెట్ 10 అంటే ఎలా.. మాకు వచ్చేది 5 అని దగ్గర దుకాణాల దగ్గర ముచ్చట్లు.
సందడే సందడిగా మారిపోయింది యావత్తు రాష్ట్ర వాతావరణం.

👍
❤️
🙏
❤
😮
20