అంతర్యామి
అంతర్యామి
May 22, 2025 at 10:13 PM
*అపరోక్షానుభూతి-20* *శంకర భగవత్పాద విరచిత* *బ్రహ్మవిద్యా విధానము* 125) _ఇమం చాకృతి మానందం తావత్ సాధు సమభ్య సేత్ వశ్యో యావత్ క్షణాత్ పుంసః ప్రయుక్తః సక్ భవేత్ స్వయమ్||_ స్వయం స్వభావ సిద్ధమైన ఈ ఆనందాను భూతిని కలుగజేసే, పదిహేను అంగాలుకల ఈ నిధిధ్యాస అనే స్వస్వరూపాను సంధానమైన సాధ నను అభ్యసిస్తూ, క్రమేణా తాను తలచిన క్షణంలో ఆ ఆనందం తనకు స్వయం స్ఫురణమై ప్రస్ఫుటంగా అనుభూతి అయేవరకూ జాగ్రత్తగా అభ్యసిస్తుండాలి 126 _తతః సాధన నిర్ముక్తః సిద్దో భవతి యోగిరాట్ | తత్ స్వరూపం న చైతస్య విషయో మనసో గిరామ్ ॥_ అలా సాధన చేసి సిద్ధి పొందడం వల్ల యోగు లలో అత్యంత శ్రేష్ఠుడైన యోగిరాజు, ఇక తాను చేయ వలసిన సాధనలేవీ లేనివాడై సాధనా నిర్ముక్తుడౌతు న్నాడు. తానే బ్రహ్మ స్వరూపుడై వుండడం వల్ల, మనస్సుకు, వాక్కుకు అవిషయుడై, ఎలాటి సాధన కర్తవ్యం లేనివాడై వుంటాడు. (127) (128) _సమాధౌ క్రియమాణేతు విఘ్నా న్యాయాంతివై బలాత్! అనుసంధాన రాహిత్యం అలస్యం భోగలాలసమ్॥_ _లయస్తమశ్చ విశేపో రసాస్వాదశ్చ శూన్యతా। ఏవం యద్విఘ్న బాహుల్యం త్యాజ్యం బ్రహ్మవిదా శనైః॥_ సమాధిస్థితి పొందడానికి సాధనా అభ్యాసం చేసే సమయంలో బలాత్కారంగా అనేక అవరోధాలు, విఘ్నాలు వస్తూంటాయి. అవేవంటే: తత్వ విచారణ తొలగిపోయి మనస్సు వేరే లౌకిక విషయాలలో తగు ల్కొనటం, సోమరితనం, భోగాను భవాలను గూర్చిన చింతన, నిద్ర, సాధనమీద ఉత్సాహం క్షీణించి మందబుద్ధికలగడం. ఏదిచేయ్యాలో, చెయ్య కూడదో తెలియకపోవడం, లౌకిక విషయానుభవాల మీద ఆకాంక్ష, శూన్యత్వం మొదలైనవి. బ్రహ్మజ్ఞా నాన్ని సత్వరంగా పొందాలని కోరికతోవున్న ముముక్షువు ఇలాంటి అనేక రకాలైన అవరోధాల్నీ, విఘ్నాల్నీ నెమ్మనెమ్మదిగా తొలగించు కోవాలి, (129) _భావ వృత్యాహి భావత్వం శూన్యవృత్యాహి శూన్యత్వ। బ్రహ్మ వృత్యాహి పూర్ణత్వం తథా పూర్ణత్వ మభ్య సేత్॥_ మనస్సు దేన్ని గురించి భావిస్తూంటుందో దాని వృత్తిలో భావలయత్వం పొందుతుంది, అలాగే దేనినీ భావించక, శూన్యవృత్తితో వుంటే, శూన్యత్వంతో వుఁటుంది. నిరంతరం బ్రహ్మనిష్ఠలోవుంటే, పూర్ణత్వం సిద్ధించి బ్రహ్మానుభూతి పొందుతుంది. కనుక, ఎల్ల ప్పుడూ పూర్ణత్వమనే బ్రహ్మానుభూతికోసం సక్రమ సాధనాభ్యాసం చేస్తూ వుండాలి. (130) _యేహి వృత్తిం జహత్యేనాం బ్రహ్మాఖ్యాం పావనీంపరామ్ వృదైవ తేతు జీవంతీ పశుభిశ్చ సమా నరాః॥_ అలాకాక, పావనమూ, పరమూ అయిన బ్రహ్మ భావాన్ని విడిచి, పూర్ణత్వం కోసం ఎలాంటి సాధనా చెయ్యని వాళ్ళు, వాళ్ళకి ప్రాప్తించిన, అతి దుర్లభమైన మానవజన్మనీ వ్యర్థం చేసుకున్న వాళ్ళై, కేవలం పశు సమానులే అవుతారు.(సశేషం)
Image from అంతర్యామి: *అపరోక్షానుభూతి-20* *శంకర భగవత్పాద విరచిత* *బ్రహ్మవిద్యా విధానము*  125...

Comments