అంతర్యామి
అంతర్యామి
May 23, 2025 at 07:08 PM
*అపరోక్షానుభూతి-21* *శంకర భగవత్పాద విరచిత* *బ్రహ్మవిద్యా విధానము* 131) _యేహి వృత్తిం విజానంతి జ్ఞాత్వాపి వర్ణయాతి, మేః తేవై సత్పురుషా ధన్యా వంద్యాస్తే భువనత్రయే॥_ ఈ పరమార్థ వృత్తిని ఎవరు మొదట అవ గాహన చేసుకుని, తరువాత దాన్ని క్రమ క్రమంగా వృద్ధి పొందించు కొంటున్నారో, వారే సత్పురుషులు, ధన్యాత్ములు. అటువంటి వారు మూడు లోకాలలో అందరి చేతా నమస్కరింప తగినవారు. (132) _ఏషాం వృత్తిం సమావృద్ధా పరిపక్వా చసా పునః॥ తేవై సద్బ్రహ్మతాం ప్రాప్తా నేతరే శబ్దవాడిన ||_ ఎవరియందీ పరమార్థ వృత్తి నిలకడగా, ఎప్పుడూ వుంటూ, సమంగా వృద్ధి పొందుతూ పరి పక్వ మౌతుందో అటువంటి మహానుభావులు సదా బ్రహ్మ స్వరూపులే అయి భాసిస్తారు. కాని, కేవలం మాటలు పలికే వాచా వేదాంతులు అటువంటి బ్రహ్మానుభవం పొంద లేరు. 133) _కుశలా బ్రహ్మ వార్తాయాం వృత్తి హీనాః సురాగిణః తేజప్య జ్ఞానతయా నూనం పునరాయాంతి యాంతిచ॥_ బ్రహ్మాను సంధానం చేస్తూ బ్రహ్మానుభవాన్ని పొందే సక్రమమైన సాధన చెయ్యక, కేవలం బ్రహ్మ విద్యని గురించి బాగా వివరిస్తూ నేర్పుగా ఉపన్యా సాలూ, ప్రవచనాలూ చేసే పండితులు, అజ్ఞానులే కనుక, అటువంటివారు మళ్ళీ మళ్ళీ జనన మర ణాల్ని పొందుతూంటారే కాని, మోక్ష పథానికి అర్హులు ఆవరు. 134 _నిమేషార్థం న తిష్ఠంతి వృత్తిం బ్రహ్మమయీం వినా॥ యథా తిష్టన్తి బ్రహ్మాద్యాః సనకాద్యాః శుకాదయః_|| బ్రహ్మాను సంధాన పరులైన మహనీయులు, బ్రహ్మాది దేవతలు, సనక సనందనాదులు, శుకాదులు, మొదలైనవారిలా ఒక్క అరనిముషమేనా బ్రహ్మాకార వృత్తిని విడిచి ఉండరు. (135) _కార్యే కారణతా యాతా కారణే నహి కార్యతా। కారణత్వం తతో గచ్ఛేత్ కార్యభావే విచారతః_ కార్యమందు కారణం యొక్క స్వభావం కనిపిస్తుంది. కాని కారణం యందు కార్యత్వం కనిపించదు. కాబట్టి తత్వవిచారం వల్ల కార్యం లేన ప్పుడు కారణం అదృశ్యమౌతుంది. (136) _అథ శుద్ధం భవేద్వస్తు యద్వై వాచామ గోచరమ్! ద్రవ్యం మృద్ధబేనైవ దృష్టాంతేన పునః పునః॥_ పైన తెలియజేసిన ప్రకారం కారణత్వం నశించినంతనే, శుద్ధము, అవాజ్మానస గోచరము అయిన సద్వస్తువు (బ్రహ్మము) కార్య కారణ విలక్షణమై భాసిస్తుంది. ఈ సత్యస్వరూప పర బ్రహ్మతత్వాన్ని, మృద్ఘట దృష్టాంతాన్ని దృష్టిలో వుంచుకొని, పదే పదే దృఢంగా అవగాహన చేసుకోవాలి.(సశేషం)
Image from అంతర్యామి: *అపరోక్షానుభూతి-21* *శంకర భగవత్పాద విరచిత* *బ్రహ్మవిద్యా విధానము*  131...

Comments