అంతర్యామి
అంతర్యామి
May 27, 2025 at 08:00 AM
*అపరోక్షానుభూతి-23* *శంకర భగవత్పాద విరచిత* *బ్రహ్మవిద్యా విధానము* 143 _ఏ భిరంగైః సమాయుక్తో రాజయోగ ఉదాహృతః కించిత్ పక్వ కషాయాణాం హఠయోగేన సంయుతః ॥_ 15 అంగాలతో కూడిన రాజయోగమనే ఈ సర్వోత్కృష్టమైన జ్ఞానయుక్త సాధనానుష్ఠానం పైన వివరింపబడిన విధంగా చెప్పబడింది. ప్రాపంచక విషయ వాసనలు ఇంకా మిగిలి వుండడం వల్ల కొద్దిగా పరిపక్వమైన మనస్సు కల సాధకులకు ఈ తత్వవిచార సాధనాక్రమాన్ని హఠయోగాభ్యాసంతో కూడా కలిపి చేసుకోవడం అత్యంత ఫలప్రదమై పరమార్థ ప్రాప్తికి దోహదమౌతుంది. (144) _పరిపక్వం మనో యేషాం కేవలోచ సిద్ధిదః గురుదైవత భక్తానాం సర్వేషాం సులభో జవాత్ ॥_ చిత్త శుద్ధితో పూర్ణంగా మనస్సు పరిపక్వం పొందిన సాధకమహాశయులకు, ఈ రాజయోగ సాధ నము శీఘ్రంగా ఫలప్రదమై సిద్ధిని కలుగ జేస్తుంది. అన్య మొల్లని గురుభక్తి, దైవభక్తి కలవారందరికీ కూడా, వారు ఏకుల, మతస్తులైనా స్త్రీ పురుష బేధం లేకుండా, చిత్తసుద్ధి కలిగించి ఈ రాజయోగ సాధన ఫలప్రదము, సులభసాధ్యము అవుతుంది.(సమాప్తం)
Image from అంతర్యామి: *అపరోక్షానుభూతి-23* *శంకర భగవత్పాద విరచిత* *బ్రహ్మవిద్యా విధానము*  143...

Comments