
అంతర్యామి
May 28, 2025 at 12:17 PM
*బంగారం లాంటి మనసు..*
పరమాచార్య వారు పదమూడు సంవత్సరాల వయస్సులోనే సన్యసించారు. వారు వ్యాఖ్యాత పరీక్ష పూర్తి చెయ్యటం కోసం తిరువానై మఠం లో బస చేసారు.అక్కడ విశేషం గా విధ్వత్ సభలు జరిగేవి. పండితులు, విద్వాంసులు, వేద విదులు అక్కడ చర్చలు జరిపేవారు. అనేక శాస్ట్రాలలో నిష్ణాతులు ఎంతో కఠిన మైన ప్రశ్నలకు సరియైన జవాబులు చెప్పి సందేహ నివృత్తి చేసేవారు. వారందరిని చూసి స్వామి వారు ఎంతో ఆనంద భరితులు అయ్యేవారు. స్వామి వారికి ఒక్క కొరవ ఉండేది. వారందరికి కనకాభిషేకం చెయ్యాలని కోరుకునేవారు. కానీ ఆ పండితులు మాత్రం స్వామి వారి బంగారు చేతులతో అక్షతలు ఇచ్చి దీవిస్తే 'చాలు ', అని మాత్రమే కోరుకునేవారు.
స్వామి వారి సంకల్పాన్ని మఠం యొక్క ఆర్ధిక పరిస్థితి ఆపలేక పోయింది.
పురాతనంగా మఠం లో ఒక బంగారు కిరీటం ఉండేది. స్వామి వారి ఆదేశాల మేరకు ఆ కిరీటాన్ని కరిగించి 500 కర్ణాభరణాలు చేయించారు. పండితుల విధ్వత్ ను బట్టి కర్ణాభరణాలను బహుకరించ దలచి వారి వారి జ్ఞానాన్ని బట్టి స్వామి వారు వాటిని బహుకరించి తమ బంగారు మనస్సును చాటుకున్నారు.
*** యజుర్వేదాంతర్గత నమకం లో "నమో హిరణ్య బాహవే"అని మహాదేవుణ్ణి కీర్తించే మంత్రం ఉన్నది. అంటే బంగారు మయమైన బాహువులు కలవాడు. అని స్టూలార్ధం. స్వామి వారు అపర శంకరులు కాబట్టి వారి మనస్సు, అనుగ్రహించే చేతులు బంగారు మయమే.~Gurucharan Das
