
అంతర్యామి
June 8, 2025 at 03:52 PM
*మహర్షి .. మయూరం*
బరోడా మహారాణి బహూకరించిన తెల్లనెమలిని రమణ మహర్షి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. తన ఆసనం పక్క నే ఆ మయూరానికి గూడు కట్టిం చి, ‘ఒరే మాధవా!’ అంటూ ప్రేమగా పిలిచేవారు. వారిద్దరి అనుబం ధాన్ని చూసి అం దరూ ముచ్చటపడేవారు. ఒక భక్తుడైతే ఎంతో ప్రభావితుడై, ఆ నెమలిపై సం స్కృతంలో 8 శ్లోకాలతో ‘మయూరాష్టకమ్’ అంటూ రాశాడు. అది చదివిన రమణులు అభినందన సూచకంగా అక్కడే ఉన్న ఓ భక్తురాలికి ఇచ్చి , బాణీకట్టమన్నారు. మర్నా డు ఆమె వీణ మీటుతూ ఆ శ్లోకాలను ఆలపిం చేందుకు సిద్ధమైంది. నెమలి అక్క డ లేకపోవడం తో రమణులు ‘అంతా బాగానే ఉంది. కానీ ఎవరిపై పాడుతున్నారో, ఆ నాయకుడు ఉండాలిగా! ఎక్క డున్నావు మాధవా, ఇలా రా!’ అంటూ పిలిచారు. వెంటనే అది పందిరిపై నుంచి దూకింది. ఆమె పాడుతుంటే అది పురివిప్పి నర్తించసాగిం ది. పాట పూర్తయ్యే వరకు నర్తిస్తూనే ఉంది. గీతం ముగియగానే.. నెమలి వీణను ముక్కు తో పొడవసాగింది. దాని భావమేంటో ఎవరికీ అర్థంకాలేదు. అప్పు డు మహర్షి ‘మాధవుడికి పాట నచ్చింది, మళ్లీ పాడమంటున్నా డు’ అన్నా రు. గాయని మళ్లీ మొదలుపెట్టగానే నెమలి నర్తించింది.
నెమలి నేర్పేపాఠం
తన వద్దనున్న మయూరాన్ని ఆలిం చి, లాలించడమే కాకుండా దాని ద్వారా భక్తులకు ఎన్నో ఆధ్యాత్మిక సందేశాల్నీ ఇచ్చారు రమణులు. అం దులో భాగంగా ఓ సందర్భంలో దాన్ని ప్రేమగా నిమురుతూ భక్తులతో ‘నీలిరంగు నెమళ్లు చిత్ర విచిత్ర వర్ణాలను ప్రదర్శిస్తూ ఎంత మనోహరంగా ఉన్నా.. తెల్లనెమలి ప్రత్యేకతే వేరు! శ్వేతవర్ణం సత్త్వగుణానికి ప్రతీక. అందుకే పవిత్రత, పరిశుద్ధతలతో ప్రకాశిస్తుంది. నిజానికి అన్ని వర్ణాలూ పుట్టేది తెలుపులోంచే! పరబ్రహ్మకు ఏ వర్ణమూ లేకపోయినా, వ్యవహారంలో శ్వేత వర్ణంతో పోలుస్తారు. నెమళ్లు జన్మ తః ఏక వర్ణం గానే ఉం టాయి. కానీ ఎదిగే కొద్దీ రకరకాల రంగులను సంతరించుకుంటాయి. మన మనసు కూడా అం తే! అప్పుడే పుట్టిన శిశువు ఎటువంటి గుణాలూ, వైవిధ్యాలూ లేకుండా ఏకరీతిగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ అనేకత్వా న్నీ , నానాత్వా న్నీ సంతరించుకుంటుంది. విశాల ప్రపంచాన్ని సృష్టించుకుని సుఖదుఃఖాలకు లోనవుతుంది. శ్వే తమయూరం మాత్రం పుట్టీ, పెరిగీ, గిట్టేదాకా అదే రంగుతో ఉండి, మార్పులేని స్వస్థితిని ప్రదర్శిస్తుంది’ అన్నా రు. అం తగా మహర్షి మనసు దోచింది కనుకనే ఆయన నిర్యాణసమయంలో వారి గది పైకప్పు మీద నిలిచి, దుఃఖపూరితమైన ధ్వని చేస్తూ హృదయ విదారకం గా విలపిం చిందా మయూరం .
~సేకరణ
