అంతర్యామి
అంతర్యామి
June 9, 2025 at 05:46 AM
*పాతికేళ్ల ఎదురుచూపు* ఓ రోజు ఆశ్రమంలో రమణ మహర్షి మధ్యాహ్నం వేళ విశ్రాంతి తీసుకుం టున్నారు. వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సాధారణంగా ఆ సమయం లో ఎవరూ రారు. కానీ ఎలా వచ్చిందో ఎనబయ్యేళ్ల వృద్ధురాలు హడావిడిగా లోనికొచ్చింది. చింపిరి జుట్టు, చిరిగిన చీర, తెల్లని వస్త్రం కట్టిన ముంతతో ‘స్వామి ఎక్క డ?’ అని ఆత్రుతతో అడుగుతోంది. ఇంతలో లోపలి నుంచి ‘అవ్వా ! ఇక్కడే ఉన్నాను రా!’ అంటూ రమణులు ఎంతో ఆదరంగా పిలిచారు. వారి వదనం , వాక్కు ఆమె కోసం నిరీక్షిస్తున్నాయా! అన్నట్లున్నాయి. వృ ద్ధురాలు ఆనందంగా, ఉద్వేగంగా ‘ఇక్కడే ఉన్నావా స్వామీ! నీకోసం పాతికేళ్లుగా తపిస్తున్నాను. ఇప్పటికి చూడగలిగాను’ అంది కన్నీళ్లతో. ఇంతలో రమణులు ‘అవ్వా ! ఇంతకాలానికి నన్ను చేరుకోగలిగావు, సం తోషం ’ అన్నారు. ఆమె మహర్షికి ఇంకాస్త దగ్గరగా వెళ్లి, ఆనంద బాష్పాలతో చూస్తూ ‘పరంజ్యో తిలా వెలిగి పోతున్నావు!’ అంది. ‘మాది కొండప్రాంతం . పాతికేళ్ల నుంచి ఈ స్వామిని చూడాలని ఆశ. ఇప్ప టికి తీరింది. ఎన్నో మైళ్లు నడిచొచ్చా ను’ అంటూ అక్క డి భక్తులకు తన కథంతా చెప్పింది. తర్వా త మెరుస్తున్న కళ్లతో ‘నాకు శాపవిమోచనమైంది’ అనుకుంటూ భక్తులు కూర్చోమన్నా వినిపించుకోక మహర్షిని చూస్తోంది. ఆయన కూడా కరుణతో చూస్తున్నారు. కొంతసేపటికి పుట్టతేనె తెచ్చానంటూ ముంత ఇచ్చింది. మహర్షి దాన్ని అమృతకలశంలా అందుకుని ‘దీన్ని మనమంతా స్వీకరించాలి, జాగ్రత్తగా దాయండి’ అన్నారాయన. అం తలోనే ‘పాపం .. పెద్దావిడ.. నా కోసం అంత దూరం నుం చి నడిచొచ్చింది! భోజనం పెడితే బాగుండును. నేనూ ఈమె మాదిరే ఉన్నాను. ఏమివ్వ గలను! చీర పెట్టి, దారిఖర్చు లిచ్చి పంపితే బావుండును’ అన్నా రు. ఆశ్రమ సభ్యు లు వెంటనే ఆమెకు భోజనం పెట్టారు. అక్కడే ఉన్న శ్రీమంతుడైన భక్తుడు ఆమె వద్దంటున్నా చీర పెట్టి, కొంత పైకం ఇచ్చి కారులో పంపారు. రమణులకు శ్రీమంతులు, ప్రఖ్యాతుల కన్నా నిరుపేదలంటేనే ప్రీతి. – చైతన్య.~సేకరణ
Image from అంతర్యామి: *పాతికేళ్ల  ఎదురుచూపు*  ఓ రోజు ఆశ్రమంలో రమణ మహర్షి మధ్యాహ్నం వేళ విశ్ర...

Comments