
అంతర్యామి
June 20, 2025 at 02:48 AM
🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ*🙏
*గ్రంథం*: శ్రీ అవధూత బోధామృతం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర
*రచన* : శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్
*దివ్య బోధలు*
మన పాపఫలం కంటే తగినంత మోతాదులో పుణ్య ఫలం ఎక్కువగా లేకపోవడమే మాయ మనలను కబళించేందుకు కారణం. మాయా బద్ధులమైనందునే సద్గురుని ప్రేమ, సామర్ధ్యాలను వారు లీలల ద్వారా, సూక్తుల ద్వారా ఎరుకపరుస్తున్నప్పటికి మనం గుర్తించి తరింప మార్గంలో నడవలేకున్నాము. *నాయనా! నీవు నన్ను మరచినా, నేను నిన్ను అనుక్షణము కంటికి రెప్పవలె సర్వకాల సర్వావస్థలయందు కనిపెట్టి కాపాడుచున్నాను. నీవు ప్రార్థించని సమయాలలో కూడా నీ సర్వ విషయాలను నేను జాగరూకుడనై చూస్తున్నాను* అని స్వామి వారు సాధకులకు మందలింపుగా తెలుపుతున్నారు.
పరమ కారుణ్యమూర్తి అయిన స్వామి వారు సర్వదా సర్వత్ర మన లోపల బయట అంతటా నిండి ఉండి మనలను గమనిస్తున్నాడనే ఎరుక మనకు అనుక్షణం కలిగితే *అదే అనన్య చింతన, అదే ధ్యానం.* అప్పుడు వాదాలకు రహస్యంగా మాట్లాడేందుకు స్వామి పటాలు ఉండేచోట వారి సన్నిధి గనుక పర దూషణ చేయకూడదు (అంటే పటాలు లేనిచోట వారులేరని) అనే మన మాయాజనిత నడవడికి ఆస్కారం లేదు. అలాంటి మాయ నుండి జాగరూకతతో మేల్కొని గురుతత్వం ఎలా ఉంటుందో ఆలోచించుకొని వారు మనలను ప్రేమించినంతగా మనం వారిని ప్రేమించేటట్లు చేయాలనే సద్గురుని తపన.
మన అందరినీ తల్లికి (పరమాత్మునికి) తగ్గ బిడ్డలు కమ్మని ఆశీర్వదిస్తున్నారు. తగిన బిడ్డలుగా రూపొందేందుకు వారి దివ్య బోధలు ఆచరించే శక్తినిమ్మని ఆర్తితో ప్రార్థిద్దాం.
🙏 *ఓం నారాయణ - ఆది నారాయణ*🙏
