JanaSena Party
JanaSena Party
June 2, 2025 at 10:07 AM
*తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ : నేమూరి శంకర్ గౌడ్* **ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ,జనసేన నాయకులు ,వీర మహిళలు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు* *ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ* : తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఎప్పటికీ మర్చిపోలేని చరిత్ర. తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాలు, కష్టసుఖాల మధ్య నిర్మాణం పొందిందని తెలిపారు.ఆ పోరాటం ప్రజల ఐక్యతకు సాక్ష్యం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయాలన్న దృక్పథం జనసేన పార్టీకి ఎల్లపుడు ఉంది అని అన్నారు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు అని శంకర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రతి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గళం విప్పారు. *భవిష్యత్తులో జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోంది.* అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. ఈ విషయంలో మన నేత పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శనం మాకు బలాన్ని ఇస్తోంది," అని స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా పార్టీ నిర్మాణం అతి త్వరలో జరుగుతోంది. ప్రతి కార్యకర్తకు గౌరవం ఉండేలా, ప్రజల సమస్యలపై పోరాటం చేసేలా జనసేన తర్వలోనే బలంగా ఎదుగుతుంది దానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే మొదలైందని " అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ నాయకులు కావ్య మండపాక ,శిరీష , జనసేన నాయకులు ఆర్కే సాగర్, దామోదర్ రెడ్డి, యడమ రాజేష్, సురేష్ రెడ్డి, నందగిరి సతీష్ ,బిట్ల రమేష్ ,చారి, సాంబశివుడు, కార్తీక్, నగేష్, రామలింగం, కొల్లా శంకర్, వెంకటేశ్వరరావు, పవన్, రత్న సాయి, ద్రాక్షాయిని, దుర్గా, జీవన్, సుబ్బు మరియు జనసేన పార్టీ నాయకులు , వీర మహిళలు పాల్గొన్నారు.

Comments