JanaSena Party
JanaSena Party
June 20, 2025 at 02:42 PM
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖ నగరంలో లక్షలాదిమంది ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి విచ్చేసిన గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. యోగా భారత దేశ సంస్కృతిలో భాగం. శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి సహాయపడే యోగాను మోదీ గారి ప్రత్యేక కృషితో ప్రపంచమంతా గుర్తించి ప్రతీ సంవత్సరం జూన్ 21 ను "ప్రపంచ యోగా దినోత్సవం" జరుపుకుంటుంది. ఆయన స్వయంగా మన రాష్ట్రంలో పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. #worldyogaday #yogaandhra2025
Image from JanaSena Party: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖ నగరంలో లక్షలాదిమంది ప్రజల ఆ...

Comments