
AP UPDATES OFFICIAL
June 15, 2025 at 09:52 AM
*బదిలీ అయిన వారు:*
సంబంధిత బదిలీ ఆర్డర్ నాలుగు సెట్స్ డౌన్ లోడ్ చేసుకుని MEO గారి కార్యాలయానికి వెళ్ళాలి.
అక్కడ MEO గారు ఒక సెట్ తీసుకుని,రిలీవింగ్ ఉత్తర్వులు ఇస్తారు.
ఈ రిలీవింగ్ ఉత్తర్వులతో ఇప్పటివరకూ పనిచేసిన పాఠశాలకు వెళ్ళాలి.
అక్కడ HM గారికి లేదా in charge కి ఒక సెట్ ఇవ్వాలి.
స్కూల్లో కూడా రిలీవింగ్ మరియు సెలవుల వివరాలు తీసుకుని,బదిలీ అయిన మండలం యొక్క MRC కి వెళ్ళి MEO గారికి ఒక సెట్ బదిలీ ఉత్తర్వులు,రిలీవింగ్ ఉత్తర్వులు ఇవ్వాలి.
MEO గారు జాయినింగ్ ఆర్డర్ ఇస్తారు.
ఈ జాయినింగ్ లెటర్ తీసుకుని,నూతన పాఠశాలకు వెళ్ళాలి.
అక్కడ ప్రస్తుతం HM గా ఉన్నవారికి ఒక సెట్ బదిలీ ఉత్తర్వులు మరియు జాయినింగ్ లెటర్ ఇవ్వాలి.
అప్పుడు హాజరు పట్టీలో సంతకం చెయ్యాలి.
పాఠశాలలో చేరిన విషయాన్ని వ్రాత పూర్వకంగా పాఠశాల నుండి MRC కి తెలియచేయాలి.
👍
👌
😂
❤️
😮
🙏
11