⚡SchoolEdu 👈 Join Now
June 21, 2025 at 12:47 AM
*🔊కాస్త మెరుగు‘బడి’నా..!*
*🍥ఈనాడు డిజిటల్, కొత్తగూడెం : రెండేళ్లుగా సర్కారు బడుల పనితీరు మెరుగుపడింది. కేంద్ర విద్యాశాఖ 2023-24 పెర్ఫార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(పీజీఐ) నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు పుంజుకున్నాయి. అభ్యసన ఫలితాలు, చదువుల నాణ్యత, మౌలిక వస తులు, అందుబాటులో బడులు- పిల్లల రక్షణ, డిజిటల్ లెర్నింగ్, విద్యా పరిపాలన విభాగాల్లో 74 సూచికలను పరిగణనలోకి తీసుకుని 600 మార్కులకు గ్రేడింగ్ ఇచ్చారు. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు కేటాయించారు.*
*💥ప్రశిష్ట-3 నుంచి ప్రశిష్ట-2లోకి..*
*🌀ప్రభుత్వ పాఠశాలల పనితీరు మదింపునకు ఆరు విభాగాలు, 74 సూచికలను ప్రామాణికంగా తీసుకున్నారు. 600 మార్కులకు 2022-23లో ఖమ్మం-225, భద్రాద్రి- 217 మార్కులు సాధించి ప్రశిష్ట-3 కేటగిరీలో నిలిచాయి. 2023-24లో ఖమ్మం-269, భద్రాద్రి-248 మార్కులతో ఒక స్థానం ఎగబాకి ప్రశిష్ట-2 కేటగిరీకి చేరాయి.*
*💥మెరుగైన అభ్యసన ఫలితాలు*
*💠పీజీఐ కొలమానాల్లో అభ్యసన ఫలితాల మదింపునకు 24 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటికి 290 మార్కులు కేటాయించారు. పిల్లల అక్షరాస్యత, గణితంలో కనీస నైపుణ్యం, బడి బయట పిల్లలు, ప్రాథమిక, ఉన్నత విద్యలో చదువు మధ్యలో మానేసిన పిల్లలు, 6-10వ తరగతిలో సైన్స్, సాంఘికశాస్త్రాల్లో ప్రావీణ్యం సాధించిన పిల్లల శాతం వంటి 24 అంశాలకు మార్కులు ఇచ్చారు. ఈ విభాగంలో 2022-23లో ఖమ్మం-98, భద్రాద్రి-87 మార్కులు సాధించగా 2023-24లో ఖమ్మం-115, భద్రాద్రి-106 మార్కులు పొందాయి.*
*💥డిజిటల్ లెర్నింగ్‌లో వెనుకబాటే*
*🥏డిజిటల్ లెర్నింగ్ విభాగంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. పాఠశాలల్లో ఇంటర్‌నెట్ సౌకర్యం, కంప్యూటర్లు, స్మార్ట్ తరగతి గదులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కంప్యూటర్ల నిష్పత్తి వంటి ఐదు అంశాలకు 50 మార్కులు కేటాయించారు. 2022-23లో ఖమ్మం-11, భద్రాద్రి-8 మార్కులు పొందగా 2023-24లో ఖమ్మం-14, భద్రాద్రి-10 మార్కులు సాధించాయి. అందుబాటులో బడులు, పిల్లల రక్షణ విభాగంలోనూ ఉభయ జిల్లాలు వెనుకబడ్డాయి. దీనికి 35 మార్కులు కేటాయించగా 2023-24లో ఖమ్మం-11, భద్రాద్రి-10 మార్కులు సాధించాయి. సర్కారు బడులను బలోపేతం చేయటంలో ఈ రెండు విభాగాలు కీలకమవటంతో వీటిల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా అధికార యంత్రాంగం కృషిచేయాలి.*
*💥ఏడో స్థానంలో ఖమ్మం*
*💫పీజీఐ నివేదిక ప్రకారం రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించిన జిల్లాల జాబితాలో ఖమ్మం జిల్లా 7, భద్రాద్రి జిల్లా 23వ స్థానంలో నిలిచాయి. 284 మార్కులతో మేడ్చల్ మల్కాజిగిరి తొలిస్థానంలో, 219 మార్కులతో ఆదిలాబాద్ చివరి స్థానంలో ఉన్నాయి. అన్ని విభాగాల్లో రాజధాని చుట్టుపక్కల జిల్లాలతో ఖమ్మం పోటీపడినా.. డిజిటల్ లెర్నింగ్, అందుబాటులో బడులు, పిల్లల రక్షణ విషయంలో వెనుకబడటం వల్ల ర్యాంకు తగ్గింది.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
✋
1