⚡SchoolEdu 👈 Join Now
June 21, 2025 at 12:47 AM
*🔊పాఠశాలల్లో సాధన*
*🍥పెనుబల్లి, న్యూస్‌టుడే : పాఠశాలల్లో నిత్యం ప్రార్థన సమయం లేదా తరగతి గదిలో అయిదు నిమిషాలపాటు విద్యార్థులకు యోగా లేదా ధ్యానం నిర్వహించాలని, అరగంట పాటు పిల్లలతో కథల పుస్తకాలు, పత్రికలు చదివించాలని ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ఆదేశించింది.*
*🌀ఇదీ ఉద్దేశం.. విద్యార్థులు నిత్యం యోగా సాధన చేస్తే శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ధ్యానం అలవాటు చేస్తే చదివే విషయాలపై ఏకాగ్రత, పెరిగి, మానసిక ప్రశాంతత చేకూరుకుంది. కథలతో నైతిక విలువలు పెరగడం, పత్రికలు చదవడం వల్ల జ్ఞానం, జీకే, సామాజిక, వర్తమాన అంశాల్లో పట్టు లభిస్తుంది.*
*💠అన్నిచోట్లా సాధ్యమేనా?.. 2022 నుంచి పాఠశాలల్లో యోగా సాధన చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నా కార్యరూపం దాల్చటం లేదు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోటే వీరున్నారు. యోగా విద్యపై అవగాహన లేని ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో ఎలా అమలవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉదయం గీతాలాపాన, వార్తలు చదవడం, ప్రధానోపాధ్యాయుల సందేశం అనంతరం విద్యార్థులు తరగతి గదులకు వెళ్తున్నారు. వారంలో చాలాసార్లు ఈ కార్యక్రమాలకు కేటాయించిన సమయం మించిపోతుందని క్లాస్ టీచర్లు అంటున్నారు. యోగా, ధ్యాన ప్రక్రియలకు సమయాన్ని మార్చితే మేలని అభిప్రాయపడుతున్నారు. బాలికలకు ఆత్మరక్షణ విద్య నేర్పేందుకు కరాటే శిక్షకులను నియమించిన తరహాలో తర్ఫీదు పొంది, అనుభవం కలిగిన వారిని యోగా శిక్షకులుగా నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.*
W