⚡SchoolEdu 👈 Join Now
June 21, 2025 at 12:48 AM
*🔊Ambedkar Research Center: రూ.100 కోట్లతో అంబేడ్కర్‌ పరిశోధన కేంద్రం* *🔶ఆరు నెలల్లో ‘బ్రిడ్జ్‌’ను ప్రారంభించేందుకు కసరత్తు* *🍥ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారతదేశంలో చాలా రాష్ట్రాలు.. ప్రాంతాల్లో కొనసాగుతున్న సామాజిక అసమానతలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును అధ్యయనం చేసేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన కేంద్రాన్ని నిర్మించనుంది. జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో ఇది రూపుదిద్దుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. వచ్చే ఆరునెలల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ‘బ్రిడ్జ్‌’ (బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డైలాగ్‌ ఆన్‌ గవర్నెన్స్, ఈక్విటీ) అని పేరు పెట్టారు. ఈ కేంద్రం కార్యకలాపాల నిర్వహణకు ఒక గవర్నింగ్‌ బోర్డు, సలహా మండలిని ఏర్పాటు చేశారు. సలహామండలి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి, సమన్వయకర్తగా అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ, సభ్యులుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధకులు, న్యాయనిపుణులు ఉంటారు. గవర్నింగ్‌ బోర్డు ఛైర్మన్‌గా ఉపముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. బోర్డులో ఆర్థిక, ఉన్నత విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శులు, వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, ముగ్గురు సంచాలకులు ఉంటారు. ప్రజాప్రయోజన అంశాలు, సాంఘిక దురాచారాలు, అక్షరాస్యత ఇలా వివిధ అంశాలపై అధ్యయనం చేయాలనుకున్న పరిశోధకులు, నిపుణులకు ఈ కేంద్రం నిధులు సమకూర్చనుంది. రాజ్యాంగ విధివిధానాల అమలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలు, విలువలు, నైతిక ప్రమాణాల అనుసరణపై విస్తృత అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం. విస్తృత పరిశోధనలకు వీలుగా కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాకేంద్రంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, విధివిధానాలపై పరిశోధనలు నిర్వహించే సంస్థగా దీనిని రూపొందించేందుకు నిర్వాహకులు ప్రణాళికలను సిద్ధం చేశారు.* *💥ఇది కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించింది కాదు* *🎙️ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం* *🌀సామాజిక అసమానతలపై పరిశోధనలు చేస్తున్న వారికి ప్రోత్సాహమిచ్చేందుకు ఆర్థిక సహకారం అందించనున్నాం. 3 లేదా 6 నెలల్లో అధ్యయనం పూర్తిచేయాలి. వాటిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచురించనున్నాం. కేంద్ర, రాష్ట్ర పథకాలు, విధివిధానాలపై అధ్యయనాలు ఆయా ప్రభుత్వాల దృష్టికి వెళ్తే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవి సద్వినియోగమవుతున్నాయా.. లోపాలను సవరిస్తే ఇంకా ఎంతమందికి ప్రయోజనం కలగొచ్చు.. అనే అంశాలపై పరిశోధన, అధ్యయనాలను ప్రచురించనున్నాం. ఇది కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించింది కాదు. విధానపరమైన అంశాలను అధ్యయనం చేసే అత్యుత్తమ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments