⚡SchoolEdu 👈 Join Now
June 21, 2025 at 12:48 AM
*🔊Union Education Ministry: కోచింగ్‌ లేకుండా ర్యాంకు కొట్టేదెలా..?* *🔶విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ఏం చేయొచ్చు?* *🔷నిపుణుల కమిటీని నియమించిన కేంద్ర విద్యాశాఖ* *🍥ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం కోచింగ్‌ లేకుండా ఇంజినీరింగ్‌ లేదా వైద్య విద్య ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించలేరనే భావన విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లోనూ నెలకొంది. ఉత్తమ ర్యాంకులు సాధించి.. అత్యుత్తమ విద్యాసంస్థల్లో సీట్లు దక్కించుకోవాలన్న తాపత్రయంతో పాఠశాల స్థాయి నుంచే కోచింగ్‌ కేంద్రాల్లో చేరుతున్నారు. పిల్లలు ర్యాంకుల పరుగు పందెంలో పడి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ దృష్టి సారించింది. కోచింగ్‌ ప్రభావం పడకుండా పరీక్షలకు పోటీపడేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలోచర్చించి.. సిఫార్సులు చేయాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. సీబీఎస్‌ఈ ఛైర్మన్, పాఠశాల, ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ మద్రాస్, తిరుచ్చి ఎన్‌ఐటీ, ఐఐటీ కాన్పుర్, ఎన్‌సీఈఆర్‌టీ ప్రతినిధులు, ఒక కేంద్రీయ విద్యాలయ, ఒక నవోదయ విద్యాలయ, ఒక ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి నెలా విద్యాశాఖ మంత్రికి పురోగతిని వివరించాలని ఆదేశించింది.* *💥ఏళ్లుగా మాటలకే పరిమితం* *🌀జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు కోచింగ్‌ లేకుండా చేయాలని.. ఇంటి నుంచైనా సన్నద్ధమయ్యేలా చేస్తామని డైరెక్ట్‌ టూ హోం(డీటీహెచ్‌) ఛానళ్ల కోసం స్వయంప్రభ పోర్టల్‌ను 2017లోనే ప్రారంభించింది. అయితే దీనిపై ప్రచారం, అవగాహన కల్పించడంలో విఫలమైంది. ఫలితంగా కోచింగ్‌ లేకుండా ఐఐటీ చదవడమనేది మాటలకే పరిమితమైంది. పలు ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లు ఇష్టారాజ్యంగా తమదే మొదటి ర్యాంకని ప్రచారం చేసుకుంటూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నా ఏ ప్రభుత్వాలూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ర్యాంకుల ఒత్తిడిలో ఏటా వందల మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2022 గణాంకాల ప్రకారం 13,044 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 2 వేల మంది పరీక్షల్లో వైఫల్యంతోనే బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొంది. రాజస్థాన్‌లోని కోటాలో 2023లో 26 మంది పిల్లలు తనువు చాలించగా...ఈ సంవత్సరం ఇప్పటివరకు 14 మంది ప్రాణాలొదిలారు. మరోవైపు పిల్లల శిక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. ‘శిక్షణ తీసుకోకపోతే తాము వెనకబడతామనే భావనతో చదువులో ప్రతిభావంతులు సైతం కోచింగ్‌ కేంద్రాల్లో చేరుతున్నారు. ఆ సంస్థలు వెనకబడిన విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు తెప్పించలేవు. బాగా చదివే వారికే కొంత సానబెడతాయి.నిజానికి వారు కోచింగ్‌ తీసుకోకున్నా మంచి ర్యాంకులే తెచ్చుకోగలరు’ అని జేఎన్‌టీయూహెచ్‌ ఆచార్యుడు ఒకరు తెలిపారు.* *💥2028 నాటికి రూ.1.34 లక్షల కోట్ల వ్యాపారం* *💠దేశంలో కోచింగ్‌ పరిశ్రమ మార్కెట్‌ ఆదాయం 2028 నాటికి రూ.1.34 లక్షల కోట్లకు చేరుకుంటుందని పుణెకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ ఇన్ఫీనియం గ్లోబల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. 2022లో ఇది రూ.58 వేల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేసింది. ఏటా 7 నుంచి 8% కాంపౌండ్‌ వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్‌)తో ఈ పరిశ్రమ ఆదాయం పెరుగుతున్నట్లు పేర్కొంది. జేఈఈ మెయిన్‌కు ఏటా 13 లక్షల మంది, నీట్‌కు 22 లక్షల మంది పోటీపడుతున్నారు. వారిలో 80% మంది ఏదో ఒక మార్గంలో కోచింగ్‌ తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.* *💥కమిటీ పరిశీలించాల్సిన అంశాలు* *➡️పాఠశాల విద్యలో లోపాలు. నిర్ణయాత్మక ఆలోచన(క్రిటికల్‌ థింకింగ్‌), విశ్లేషణాత్మక నైపుణ్యాలు, నవ కల్పన తదితర అంశాలపై తక్కువ దృష్టి సారిస్తుండటం* *➡️డమ్మీ స్కూళ్ల కట్టడి* *➡️పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా తొలి నుంచి విద్య అందించడం* *➡️ప్రముఖ విద్యాసంస్థల్లో తక్కువ సీట్లు ఉండటం.. నాణ్యమైన విద్యకు డిమాండ్‌ పెరుగుతుండటం* *➡️ఇతర కెరీర్‌ మార్గాలపై అవగాహన పెంపొందించడం* *➡️పోటీ పరీక్షల్లో కోచింగ్‌ ప్రభావంపై అధ్యయనం* *➡️శిక్షణ కేంద్రాల ప్రకటనలు, తప్పుడు మార్గాల్లో ర్యాంకులను క్లెయిమ్‌ చేసుకోవడం తదితర వాటిపై సమీక్ష* *➡️పాఠశాలలు, కళాశాలల్లో కెరీర్‌ గైడెన్స్‌పై సూచనలు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments